E-Paper
Advertisement

ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ రిలీజ్..మూగవాడిగా అనీష్ మెప్పించేనా?

ఎన్టీఆర్ చేతుల మీదుగా ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ రిలీజ్..మూగవాడిగా అనీష్ మెప్పించేనా?
Advertisement

Itlu Arjuna Trailer: సాయి అనీష్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇట్లు అర్జున'(Itlu Arjuna). ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పెద్ద సినిమాలు కారణంగా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఇట్లు అర్జున ఎట్టకేలకు కొత్త విడుదల తేదీని ప్రకటించి ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. నవంబర్ 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఇట్లు అర్జున సినిమా నుంచి తాజాగా ట్రైలర్ వీడియో విడుదల చేశారు. ప్రముఖ పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) చేతులమీదుగా ఈ ట్రైలర్ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

మాటలు రాకపోయినా.. మాటల్లో చెప్పలేనంత ప్రేమ..

ఈ ట్రైలర్ వీడియోలో భాగంగా హీరో మూగవాడి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. మాటలు రాకపోయినా మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉందంటూ తన ప్రేమ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు అయితే ఇందులో అర్జున్ దొంగతనాలు చేస్తూ ఉంటారని ఈ ట్రైలర్ వీడియో చూస్తేనే తెలుస్తుంది. ప్రేమకథతో పాటు భారీగా యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయని ఈ ట్రైలర్ ద్వారా చూపించారు. ఇక ఇందులో అనస్వర రాజన్ కీర్తి అనే పాత్రలో కనిపించబోతున్నారు. కీర్తి చాలా పద్ధతి గల అమ్మాయి, పద్ధతికి పట్టుచీర కట్టినట్టు ఉంటుందంటూ వచ్చే డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి.

మూగవాడి పాత్రలో హీరో..

Advertisement

ఇలా హీరో మూగవాడిగా నటిస్తూ తనలో ఉన్న హావభావాలను ఎలా వ్యక్తపరిచారనేది ఆసక్తికరంగా ఉంది. మూగవాడి పాత్రలో నటిస్తూ అనీష్ సాహసమే చేశారని చెప్పాలి. మరి నవంబర్ 13వ తేదీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుంది? మూగవాడి పాత్రలో హీరో సక్సెస్ కొట్టేనా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా అక్టోబర్ నెలలోనే మూడు సార్లు విడుదల తేదీలను ప్రకటించినా మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ చిత్ర నిర్మాతలు విడుదల తేదీపై ఫుల్ క్లారిటీ ఇస్తూ ప్రమోషన్లను మొదలుపెట్టారు.

Advertisement

ఇక ఈ సినిమా ద్వారా మహేష్ ఉప్పల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. వాట్ నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్ సంయుక్తంగా వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని నిర్మించగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో కింగ్ నాగార్జున(Nagarjuna) సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ వీడియో కూడా అమాంతం ప్రేక్షకులను ఆకట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి. మరి నవంబర్ 13న రాబోతున్న ఇట్లు అర్జున ఎలాంటి హిట్ కొట్టబోతున్నారో తెలియాల్సి ఉంది.

Also Read: వాయిదా పడిన కిరణ్ అబ్బవరం మూవీ.. రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Related News

బత్తా.. విజయ్ సేతుపతి విశ్వరూపం! తెలుగు హీరోలకు ఇదో ఛాలెంజ్!

వాయిదా పడిన కిరణ్ అబ్బవరం మూవీ.. రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

యశ్ తల్లి హీరోయిన్ గా ప్యూర్ లవ్ స్టోరీ.. వివి వినాయక్ చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్!

లెజెండ్ సినిమాపై రాధిక ఆప్టే కామెంట్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన ఎస్కేఎన్!

నేరాలు జరిగితే సినిమాలే కారణమా? ఈ పిచ్చి మాటలు ఆపేయండి: సందీప్ రెడ్డి

సంచలనం రేపుతున్న ఫిల్మ్ ఛాంబర్ కూల్చివేత కుట్ర! గుండెకాయ లాంటి భవనాన్ని మింగేస్తున్న పెద్దల స్వార్థం?

బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన ప్యాంట్ వెనుక ఇంత స్టోరీ ఉందా?

Big Stories

Advertisement
×