Vijay Sethupathi:ఏంటీ సినిమా చేయాలా ..అయితే ఒక ఇంట్రో , మూడు పాటలు ,నాలుగు కామెడీ ట్రాకులు, ఐదు ఫైట్లు కంపల్సరీ.ఇదీ మన హీరోల లెక్క. ఫ్యాన్స్ ఫీలవుతారనో, కమర్షియల్ మీటర్ మిస్ అవుతుందనో,ట్రేడ్ వర్గాలు గోల చేస్తాయనో,లేక వీటికి తప్ప మరేటికీ మేము సూట్ అవ్వం అని ఫిక్స్ అయ్యారేమో తెలీదు కాని ఈ సర్కిల్ దాటి సినిమా చేయాలంటే వంద లెక్కలేస్తారు.
ఫైనల్ గా చేయరనుకోండి ..అది వేరే విషయం.కానీ హీరోయిజాన్ని పక్కన పెట్టి సరైన కథతో లెక్క వేసుకోకుండా సినిమా చేస్తే నంబర్స్ కి మించిన ప్రేమ ఆడియన్స్ నుండి రాబట్టుకోవచ్చని ప్రూవ్ చేశాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.
కథ డిమాండ్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తానని ఇప్పటికే ఎన్నో సార్లు ప్రూవ్ చేశాడు ఈ తమిళ వెర్సటైల్ యాక్టర్ . ఇదిగో ఇపుడు మరోసారి బత్తా సినిమాతో తానెంటో చెప్పకనే చెప్పాడు.ఒక స్టార్ ఇమేజ్ ఉండి దాదాపు ఆరగంట పైనే బాత్రూం లో పడి”పోవాలంటే”ఎన్ని గట్స్ ఉండాలి, అభిమానుల మనోభావాలు ఏమై పోవాలి, ఓన్ క్రేజ్ ఎంత డ్యామేజ్ కావాలి.కానీ అబ్బే అవన్నీ నా దగ్గర నడవవు, కథకి కావాలా..అయితే సరెండర్ అయిపోతా అంటూ తనని తాను తగ్గించుకుని డబల్ అయిపోయాడు .మక్కల్ సెల్వన్ అంటే ప్రజల ఆస్తి ,ఏ ముహుర్తాన సీను రామస్వామి మక్కల్ సెల్వన్ అని విజయ్ సేతు పతికి ఆ పేరు పెట్టారో కాని నిజంగానే తమిళ తంబీలకి ఒక నిధిలా మారిపోయాడు.
పది నిమిషాలు అయిందా పాట పాడేద్దాం.ఇరవై నిమిషాలు అయిందా ఎవన్నో ఒకన్ని ఇరగ్గొడదాం,క్లైమాక్స్ వచ్చిందా ఐటం సాంగ్ వేసుకుందాం ….ఇలా సినిమా ఎక్కడా మీటర్ లో ఉండదు.కానీ సినిమాలో మ్యాటర్ మాత్రం చాలా ఉంది. అదిగో ఆ మ్యాటర్ ని నమ్మే తనని తాను సినిమాకి ఇచ్చేశాడు విజయ్.
సినిమాలు చేయడం ఒకెత్తు.ఇలాంటి కథని నమ్మి దర్శకుడికి సినిమాని ఇవ్వడం మరో ఎత్తు.అదిగో ఆ ఎత్తు వేసే ఎంతో ఎత్తుకి ఎదిగిపోయాడు. తానెందుకు మిగతా వారికన్నా డిఫరెంట్ అనేది ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేశాడు.
ముఖ్యంగా సింహం లా ఉండే బత్తా చిన్నోడి చేతిలో చిలకలా బందీ అయిపోతాడు అన్న పాయింట్ ని ఒప్పుకున్న విజయ్ కి సలాం కొట్టాల్సిందే. ఇక సినిమాలో విజయ్ చూపించిన కోపం, ప్రేమ ,బాధ ,భయం, అమాయకత్వం, వచ్చే మార్పు ఇలా నవ రసాలని ఒకే సినిమాలో ఒలికించడం నెక్స్ట్ లెవెల్. ఇక బత్తాకి పోటీనిచ్చిన శబరిని కూడా మెచ్చుకొని తీరాల్సిందే.ఒకరకంగా ఇద్దరు పోటీ పడి నటించారంటే ఆశ్చర్యం లేదు.
మరి సినిమాలంటే ఇదిగో ఇలాగే ఉండాలి అని గిరి గీసుకుని కూర్చున్న మన సో కాల్డ్ తెలుగు స్టార్ హీరోలు ఇప్పటికే ఆ పంజరం నుండి బయటికి వస్తారా …సినిమా అంటే ఇలా కూడా ఉండొచ్చు అని ప్రూవ్ చేసిన విజయ్ సేతు పతిని ఆదర్శంగా తీసుకుంటారా..వందల కోట్లు కాదు..నంబర్స్ కి లొంగని సినిమా ఇంకా ఉందని రియలైజ్ అవుతారా ? ఆ హీరోయిజం పక్కన పెట్టి అంతకి మించిన హీరోయిజం ఇదిగో అని సవాలు విసిరిన ఈ మక్కల్ సెల్వన్ చాలెంజ్ ని స్వీకరిస్తారా …? చూడాలి. (అఫ్ కోర్స్ చూస్తూనే ఉండాలి).
also read :తింగరి సీతకు ఇంత క్రేజ్ ఏంట్రా మావా? అల్లరి ఆరతి అసలు ఎంత సంపాదిస్తుందో తెలుసా?