Renu desai:సాధారణంగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే అందులో నటీనటుల పర్ఫామెన్స్ మాత్రమే కాదు వారు ధరించే కాస్ట్యూమ్స్ కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే గతంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన బాలు (Balu )సినిమాలో ఆయన ధరించిన ప్యాంట్ అప్పటి యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎంతో మంది కాలేజ్ స్టూడెంట్స్ ఈ ప్యాంట్ ను రీ స్టైల్ చేసే ప్రయత్నం కూడా చేసి సోషల్ మీడియాలో తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. అలా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పాత్ర కోసం డిజైన్ చేసిన ఈ ప్యాంట్ ధరపై అప్పట్లో పలు రకాల వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాజీ భార్యా ప్రముఖ హీరోయిన్ రేణూ దేశాయ్ (Renu Desai) స్పందించడం ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారింది.
తాజాగా ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణూదేశాయ్ మాట్లాడుతూ.. “బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ధరించిన ప్యాంట్ రూపొందించడానికి మేము చాలా కష్టపడ్డాము. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలీలోని మిలన్ లో కేవలం 5 ప్యాంట్లు మాత్రమే రూపొందించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఒక రియల్ క్లాత్ తో ఆ ప్యాంట్స్ ను డిజైన్ చేశారు. అయితే దానికోసం మేము ముందుగానే అడ్వాన్స్ పే చేసాము. అలా అడ్వాన్స్ ఇచ్చిన 3 నెలల తరవాత మళ్లీ నేను అక్కడికి వెళ్లి దానిని తీసుకున్నాను. వాళ్లు ఐదు డిజైన్ చేయగా.. అందులో ఒకటి నేను తీసుకున్నాను.. అప్పట్లోనే వాటికి 75 వేల రూపాయలు ఖర్చు పెట్టాము.
అయితే ఆ సినిమాలో ఆయన కంటిన్యూగా ప్యాంట్స్ మారుస్తూ వచ్చారు. అయితే ఒక పది ప్యాంట్స్ వేసుకునే బదులు.. ఒక్కొక్కటి రూ.5000 వేసుకున్నా.. 10 ప్యాంట్లకు 50,000 అవుతుంది.. ఒక 25 వేలు ఎక్స్ట్రా పెట్టుకుంటే దాని లుక్కే మారిపోతుందని నేను నిర్మాతను కన్విన్స్ చేశాను. సినిమా విడుదలయ్యాక అందరూ దాని గురించే మాట్లాడుకోవడం చూసి మేము ఎంతో సంతోషపడ్డాము. ముఖ్యంగా ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత కూడా ఈ ప్యాంటు గురించి మాట్లాడుతున్నారు అంటే ఆరోజు ఎంతలా దాని కోసం కష్టపడ్డామో అర్థం చేసుకోండి” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన ప్యాంట్ వెనుక ఉన్న అసలు స్టోరీ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
also read:హైపర్ ఆది పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమేనా?
దీనిని డిజైన్ చేయడానికి ఇటలీలోని హాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ పనిచేశారు. పైగా ఆయనకు రేణు దేశాయ్ కూడా సహాయం చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ దగ్గరుండి మరీ దీనిని డిజైన్ చేయించడం అప్పట్లో వైరల్ గా మారింది.ఇకపోతే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా కూడా ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ లుక్స్, యాక్టింగ్ , డ్రెస్సింగ్ స్టైల్ కి మాత్రం మంచి ప్రశంసలు లభించాయి. పవన్ కళ్యాణ్, శ్రియ శరన్, నేహా ఒబేరాయ్, గుల్షన్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.