E-Paper
Advertisement

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి!

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి!
Advertisement

Indiramma Houses: రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిరుపేద‌ల కోసం నిర్మిస్తున్న ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కంలో ఇంత‌వ‌ర‌కు 2,21,500 ఇళ్ల‌లో గృహ‌ప్ర‌వేశాలు పూర్త‌య్యాయ‌ని ఈ దీపావ‌ళి రోజున ప్ర‌తి ఇందిర‌మ్మ ఇంటిలో దీపావ‌ళి వేడుక‌ల జ‌ర‌పాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆరోజున పేద‌ల ఇంట్లో వెలిగే ప్ర‌తిదీపం తెలంగాణ ప్ర‌జాప్ర‌భుత్వ సంక‌ల్పానికి ప్ర‌తీక కావాల‌న్నారు.

దీపావ‌ళి వేడుక‌లు అనే పోస్ట‌ర్‌..

ఇందిర‌మ్మ ఇళ్లు ఇవ్వాల‌న్న సంక‌ల్పంతో తొలివిడ‌త 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు చేయ‌గా ఇప్ప‌టికి 2,21,500 ఇళ్ల‌లో గృహ ప్ర‌వేశాలు పూర్త‌య్యాయ‌ని, మ‌రో 1.90 ల‌క్ష‌ల ఇళ్ళు వివిధ నిర్మాణ‌ద‌శ‌ల్లో పూర్తికానున్నాయ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. గృహ ప్ర‌వేశాలు జ‌రుపుకున్న ఇళ్ల‌కు దీపావ‌ళి రోజున ప్ర‌జాప్ర‌తినిధులు, క‌లెక్ట‌ర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిర‌మ్మ ఇళ్ళ క‌మిటీ స‌భ్యులు, ఈ ప‌ధ‌కంతో మ‌మేక‌మైన అంద‌రూ ఆ ఇళ్లకు వెళ్లి వారి ఆనందాల్లో భాగ‌స్వాములు కావాల‌ని కోరారు. దీనికి సూచిక‌గా మా ఇందిర‌మ్మ ఇంట్లో దీపావ‌ళి వేడుక‌లు అనే పోస్ట‌ర్‌ను మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుతో క‌లిసి మంత్రి పొంగులేటి ఆవిష్క‌రించారు.

Advertisement

Also Read: నా ఆయుష్షు తీసుకున్నా పర్లేదు.. మా అక్కను బ్రతికించు దేవుడా.. కన్నీళ్లు పెట్టిస్తున్న ముఖేష్!

జి+5 ప‌ద్ద‌తిలో..

తొలి విడ‌త‌గా 4.50 ల‌క్ష‌ల ఇళ్లు, రెండో విడ‌త 2.50 ల‌క్ష‌ల ఇళ్ల‌తో పాటు హైద‌రాబాద్ క్యూర్ ఏరియా ప‌రిధిలో ల‌క్ష ఇళ్ల‌ను మంజూరు చేశామ‌ని చెబుతూ హైద‌రాబాద్ త‌ర‌హాలోనే రాష్ట్రంలోని నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ కార్పొరేష‌న్‌ల‌లో కూడా ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నిర్మాణం చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించారు. జి+5 ప‌ద్ద‌తిలో నిర్మించ‌నున్న ఈ ట‌వ‌ర్స్ నిర్మాణానికి సంబంధించి దీపావ‌ళి లోగా నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో నిర్మిస్తున్న ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ నుంచి వ‌చ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తామ‌ని మంత్రి పున‌రుద్ఘాటించారు.

బ్యాంకు ఖాతాల‌కు..

Advertisement

రాష్ట్రంలో 40 వేల కోట్ల‌తో చేప‌డుతున్న ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఎట్టిప‌రిస్ధితుల్లోనూ ఆపేదిలేద‌ని స్ప‌ష్టం చేస్తూ ఇప్ప‌టికే ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల బ్యాంకు ఖాతాల‌కు ప్ర‌తి సోమ‌వారం నేరుగా హైద‌రాబాద్ నుంచి అవినీతి ర‌హితంగా నిధుల‌ను జ‌మ‌చేస్తున్నామ‌ని వివ‌రించారు. రాష్ట్రంలోని న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, గ్రామాలేగాక మారుమూల ప్రాంతాలు, తండాల‌లో కూడా ఈ ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం జ‌రుగుతోంద‌ని ఫ‌లితంగా పేద‌వారి సొంతింటిక‌ల సాకార‌మ‌వుతోంద‌ని మంత్రి పొంగులేటి అన్నారు.

Also Read: బిగ్ టీవీ ఎఫెక్ట్.. కోనసీమ వరద బాధితులకు చేరిన సాయం!

Tags

Related News

హుస్నాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 6.10 కోట్ల నిధులు మంజూరు!

ఆగమైతున్న హైదరాబాద్.. నిరసన పేరిట వేల లీటర్ల నీరు వృథా.. రగిలిపోతున్న ప్రజలు!

అబద్ధాల ప్రచారంలో బీఆర్ఎస్ నంబర్ వన్.. జగదీశ్ రెడ్డికి యెన్నం శ్రీనివాస్ కౌంటర్!

సదర్ సమ్మేళనంలో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు!

హైదరాబాద్ ED బిగ్ ఆపరేషన్.. అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ గుట్టురట్టు!

మల్కాజిగిరిలో చెత్త సమస్యలకు చెక్.. ఎంఎంసీ కమిషనర్ సంచలన నిర్ణయాలు!

ఎంపీలో తెలంగాణ యువతి ఆత్మహత్య.. బీటెక్ థర్డ్ ఇయర్, వెలుగులోకి షాకింగ్ విషయాలు,

Big Stories

Advertisement
×