E-Paper
Advertisement

ఏడాది తరువాత కోదండరామ్‌కు టైం ఇచ్చిన సీఎం! కలిసిన టీజేఎస్ ప్రతినిధులు! కరువు నేపథ్యంపై ప్రొఫెసర్‌ కీలక చర్చలు!

ఏడాది తరువాత కోదండరామ్‌కు టైం ఇచ్చిన సీఎం! కలిసిన టీజేఎస్ ప్రతినిధులు! కరువు నేపథ్యంపై ప్రొఫెసర్‌ కీలక చర్చలు!
Advertisement

మిత్రపక్షమే గానీ, తెలంగాణ జన సమితి ప్రతినిధులతో సీఎం రేవంత్‌ రెడ్డి కలిసి చాలా రోజులైంది. ఎన్ని సార్లు ఆయన్ను కలుద్దామన్నా అపాయింట్‌మెంట్‌ దొరకలేదు. మొత్తానికి ఏడాది తరువాత ఇలా కరువు పరిస్థితులు వీరిని కలిపాయనుకోవాలి. ఎమ్మెల్సీ కోదరండరామ్‌ నేతృత్వంలో సీఎంను కలిశారు వీరంతా.

దాదాపు గంటన్నరపాటు సీఎంతో పలు కీలక సమస్యలపై చర్చలు జరిగాయి. ప్రధానంగా ఎల్‌నినో కరువు నేపథ్యంలో కోదండరామ్‌ సీఎంకు పలు సూచనలు చేశారు. ఇటీవల పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ టీజేఎస్ ప్రతినిధులను కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. దీనిపై వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించలేదు కోదండరామ్‌.

Advertisement

ఇప్పటికే నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. కోదండరామ్‌పై కూడా ఒత్తిడి పెరుగుతోంది. జాబ్‌ క్యాలెండర్‌ ఊసే లేకపోవడంపై, ప్రభుత్వం పై టీజేఎస్‌ తరపును ఒత్తిడి పెంచకపోవడంపైనా ఆపార్టీలోనే అసంతృప్తి రగులుకుంటున్నది. దీనికి తోడు ఎన్నికల సమయంలో తమకు ఇస్తామన్న పదవుల విషయాన్ని కాంగ్రెస్ ఏనాడో మరిచిపోయింది.

ఇలా అవసరానికి మాత్రమే కోదండరామ్‌ను వినియోగించకుంటున్నదే తప్ప.. మిత్రపక్షంగా ఇచ్చిన హామీల అంశాన్ని గాలికి వదిలేసిందనే తీవ్ర నైరాశ్యం టీజేఎస్ ప్రతినిధుల్లో ఉంది. ఈ క్రమంలో గ్రాడ్యుయేషన్‌ ఎన్నికల్లో తమ మద్దతు ప్రకటించే అంశాన్ని వ్యూహాత్మకంగానే పెండింగ్‌లో పెట్టేసింది టీజేఎస్‌ పార్టీ.

Advertisement

రాష్ట్ర కార్యవర్గంలో చర్చించిన అనంతరం నిర్ణయం ప్రకటిస్తామని ఉత్కంఠను రేకెత్తించేలా వ్యూహం పన్నినా.. చివరాఖరకు కోదండరామే దీన్ని మీదేసుకుని తిరిగే పరిస్థితులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్‌కు కూడా కోదండరామ్‌పైనే గురి ఉంది. ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో.. కోదండరామ్‌పై కీలకమైన బాధ్యతలు పెట్టడం మూలంగా, నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని కొంత తగ్గించి  ప్రభుత్వ అనుకూలత దిశగా వారి మనసులను మార్చగలరనే భావనలో సీఎం ఉన్నారు.

ఈ క్రమంలో సీఎంతో భేటీలో ఈ అంశం కూడా కీలకంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. నిరుద్యోగుల అంశాన్ని కోదండరామ్‌.. సీఎంకు వివరించడంతో పాటు జాబ్‌ క్యాలెండర్‌ అంశాన్ని కూడా గుర్తు చేసినట్టు తెలిసింది. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ క్రమబద్ధీకరణ ప్రకారం ఇవ్వాలని కోదండరామ్‌ ఈ సందర్బంగా సీఎంను కోరారు.

ఎల్‌నినో నేపథ్యంలో కౌలు రైతులను గుర్తించి వారికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చి కౌలు రైతులను, రైతులందరినీ ఆదుకోవాలని కోరారు. కరువు నేపథ్యంలో చర్చ జరిగినా ప్రధానంగా గ్రాడ్యుయేషన్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం.. టీజేఎస్‌ నేతలకు పదవుల పంపకం విషయంలో కీలక చర్చ జరిగినట్టు తెలిసింది. ఈనెలలో నామినేటెడ్ పదవులు ఉంటాయని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ప్రకటించిన నేపథ్యంలో అందులో టీజేఎస్‌ ప్రతినిధులకు కూడా చాన్స్‌ రావొచ్చని ఆశిస్తున్నారు.

Tags

Related News

కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ…! ఈ రాష్ట్రాల్లో జనాలకు సీఎంలు భయపడాల్సిందే.. జవాబుదారీ పాలన అందివ్వాల్సిందే!

బీఆర్ఎస్ పార్టీలో హరీశ్‌రావుకు ‘ఫ్రీ హ్యాండ్.. ఎందుకో తెలుసా..?

మెగాలోమేనియా, డెల్యూషనల్‌ డిజార్డర్‌! అమిత శక్తిమంతులమనే ఊహా.. తానే గొప్ప అనే భ్రాంతి! ఇదేనా బీఆరెస్‌ మానసిక స్థితి?

ఖైరతాబాద్ ఉపఎన్నిక సస్పెన్స్.. దానం నాగేందర్ వర్సెస్ పి. విజయారెడ్డి న్యాయపోరాటంలో గెలుపెవరిది?

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కమలం గట్టి ఫోకస్.. కారణం బీజేపీ అసలు ప్లాన్ ఇదే?

ఉమ్మడి మెదక్ జిల్లా పదవుల్లో.. పక్క జిల్లా ఎమ్మెల్యే పైరవీలు..?

తమిళనాడుకు షాక్.. ఏపీకి జాక్‌పాట్.. రూ. 1614 కోట్ల కొరియన్ పెట్టుబడుల వెనుక అసలు కథ!

Big Stories

Advertisement
×