Hatah Postponed: నవంబర్ నెలలో పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద పోటీ నెలకొంది. దీపావళి పండుగను పురస్కరించుకొని చిన్న సినిమాలనుంచి పెద్ద సినిమాలన్నీ ఒకేసారి విడుదల తేదీలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉన్న క్రమంలో కొన్ని సినిమాలు తమ విడుదల తేదీల నుంచి తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘హత:'(Hatah) సినిమా కూడా వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఈ సినిమా వాయిదా గురించి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద అనవసరమైన క్లాష్ ను నివారించడం కోసం తమ సినిమాని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తెలియచేశారు. ఇది కేవలం బాక్స్ ఆఫీస్ పోటీ నుంచి తప్పుకోవటం మాత్రమే కాదు ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అలాగే బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటమే తమ ప్రధాన ఉద్దేశమని చిత్ర నిర్మాతలు తెలిపారు. హడావిడిగా ఇతర సినిమాలతో పోటీగా మా చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడం కంటే మా సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడు మంచి క్వాలిటీతో చూడాలన్న ఉద్దేశంతోనే విడుదల వాయిదా వేస్తున్నామని తెలిపారు.
ఇక ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 6 తేదీ విడుదల చేయబోతున్నట్లు ఇదివరకు చిత్రం బృందం అధికారకంగా తెలియజేశారు .అదే దిశగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక నవంబర్ 5వ తేదీ రామాయణ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి విడుదల అయ్యే సినిమాలకు థియేటర్ల కొరత కూడా ఏర్పడుతున్న నేపథ్యంలోనే ‘హత:’సినిమా తప్పనిసరి పరిస్థితులలో వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
New Release date will be announced soon . Thank you all 😊#HATAH pic.twitter.com/vtWbBQV3Wz
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 4, 2026
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హారర్, సస్పెన్స్, సూపర్నాచురల్ మరియు మిస్టరీ వంటి విభిన్న జానర్ల ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటాయి. ప్రేక్షకులను ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుందని తెలుస్తుంది.అనుష్ గోరాక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కిరణ్ అబ్బవరం సమర్పణలో, ఆయన సొంత బ్యానర్ ‘KA ప్రొడక్షన్స్’, ‘పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం చివరి నిమిషంలో వాయిదా పడింది. మరి కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది. ఇక నవంబర్ నెలలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ పోటీలో హత: నవంబర్ లోనే వస్తుందా లేదంటే డిసెంబర్ కు వాయిదా పడుతుందా తెలియాల్సి ఉంది. ఇక కిరణ్ అబ్బవరం ఒకవైపు నిర్మాతగా కొనసాగుతూనే మరోవైపు హీరోగా దర్శకుడిగా కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే త్వరలోనే ఈయన స్వీయ దర్శకత్వంలో రియాలిటీ అనే సినిమా రాబోతుంది. డిసెంబర్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
Also Read: మన సంస్కృతికి ప్రతిరూపం రామాయణ.. అల్లు అర్జున్ పోస్ట్ తో భారీ హైప్!