Radhika Apte -SKN: సౌత్ సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి బాలీవుడ్ అవకాశాలను అందుకున్న తర్వాత కొంతమంది హీరోయిన్లు సౌత్ సినిమాల పట్ల చులకన భావంతో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా సౌత్ ఇండస్ట్రీ గురించి చులకనగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తాజాగా నటి రాధిక ఆప్టే(Radhika Apte) సైతం సౌత్ ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఈమె తెలుగులో బాలకృష్ణ(Balakrishna) హీరోగా నటించిన లెజెండ్(Legend) సినిమా పట్ల చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో విమర్శలకు కారణమవుతున్నాయి.
ఇలా లెజెండ్ సినిమాలో వయసులో పెద్దవాడితో తన చేత రొమాన్స్ చేయించారని నా పాత్రను చంపేశారు అంటూ ఈమె లెజెండ్ సినిమా గురించి చేసిన కామెంట్స్ పై బాలయ్య అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నిర్మాత ఎస్ కే ఎన్ (SKN)సైతం ఈ అంశంపై స్పందిస్తూ నటి రాధిక ఆప్టేకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. ఈయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ అంశం గురించి స్పందిస్తూ.. ప్రతి నటుడికి ఇండస్ట్రీ గురించి వారి అభిప్రాయాలను తెలియజేసే హక్కు ఉంటుంది అయితే వారికి అవకాశాలు ఇచ్చి ఆదరించిన ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటానికి చాలా తేడా ఉంటుందని తెలిపారు.
సౌత్ ఇండియా సినిమా అనేది ఎంతో ప్రత్యేకమైన సాంస్కృతిక గుర్తింపు, సంప్రదాయాలు, కథా విలువలను కలిగి ఉన్నాయి. ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఇతరులకు కాస్త కొత్తగా అనిపించవచ్చు. కానీ మన సంస్కృతిలో అవి పూర్తిగా సహజమైనవి కావచ్చని తెలిపారు. సౌత్ సినిమాలలో నటిస్తూ సౌత్ సినిమాల ద్వారా గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు విమర్శించడం సరికాదని ఈయన మండిపడ్డారు.
Accepting roles, working in South Indian cinema, gaining recognition and opportunities here, and then years later criticising the same industry, its stories and cultural traditions is becoming an unfortunate pattern.
Every actor has the right to express an opinion. But there is…
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 4, 2026
సినిమా ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి నిర్మాణాత్మక విమర్శలను తామెప్పుడు స్వాగతిస్తాం కానీ ఎంపిక చేసుకొని మరి విమర్శించడం సరికాదని తెలిపారు. మిమ్మల్ని ఆదరించిన సినిమా పరిశ్రమను గౌరవించండి అంటూ ఈ సందర్భంగా ఈయన ఎక్కడ కూడా రాధిక ఆప్టే పేరు బయట పెట్టకుండానే తనకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యల పట్ల మద్దతుగా నిలబడగా మరి కొంతమంది మాత్రం ఈయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ కే ఎన్ గతంలో తెలుగు హీరోయిన్ల గురించి తక్కువ చేసి మాట్లాడిన వీడియోలను కూడా బయట పెడుతూ ఈయన పట్ల విమర్శిస్తున్నారు. రక్త చరిత్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన రాధిక ఆప్టే తెలుగులో లెజెండ్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత పలు తెలుగు సినిమాలలో నటించిన ఈమె ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు.
Also Read: నేరాలు జరిగితే సినిమాలే కారణమా? ఈ పిచ్చి మాటలు ఆపేయండి: సందీప్ రెడ్డి