E-Paper
Advertisement

నేరాలు జరిగితే సినిమాలే కారణమా? ఈ పిచ్చి మాటలు ఆపేయండి: సందీప్ రెడ్డి

నేరాలు జరిగితే సినిమాలే కారణమా? ఈ పిచ్చి మాటలు ఆపేయండి: సందీప్ రెడ్డి
Advertisement

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా విభిన్నమైన సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చి మంచి సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి(Sandeep Reddy) ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సందీప్ రెడ్డి సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఏదైనా తన సినిమాల సమయంలో మాత్రమే స్పందిస్తూ ఉంటారు అయితే తాజాగా ఈయన సినిమాల గురించి తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా చేసిన పోస్ట్ సంచలనగా మారింది.

సినిమాల వల్లే హింసాత్మక ఘటనలు..

ఇటీవల అనంతపురం రాప్తాడులో హేమంత్ అనే వ్యక్తి పదవ తరగతి చదువుతున్న గోపికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ రాప్తాడు ఘటనతో (Rapthadu Incident) ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఈ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావడంతో పెద్ద ఎత్తున ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడానికి సినిమాలే కారణం అంటూ ఎంతోమంది ఈ ఘటనపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.

బాధితుల పట్ల సానుభూతి చూపించండి..

Advertisement

ప్రస్తుతం సినిమాలు చాలా హింసను ప్రేరేపిస్తూ ఉన్నాయని అందుకే యువత కూడా సినిమాలను స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు అటూ చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఇలా విమర్శలు చేస్తున్న వారి పట్ల సందీప్ రెడ్డి స్పందిస్తూ తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి స్పందిస్తూ ఈ సమాజంలో ఎవరైనా నేరానికి పాల్పడినప్పుడు మనం ముందుగా బాధితుల పట్ల సానుభూతితో స్పందించాలి. అలాగే ఆ సమస్యకు గల కారణం గురించి ఆలోచించాలి కానీ ఆ ఘటనకు సినిమాలను బలి పశువును చేయకూడదని తెలిపారు.

Advertisement

మీ ఆందోళన బాధితులు వారి కుటుంబాలు గురించి కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి ఒక ఘటన జరిగితే దానిని మీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని స్పష్టమవుతుంది. ముఖ్యంగా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీలో ఖాళీగా ఉన్న దరక నిర్మాతలు హీరో హీరోయిన్లు ఇతరుల సినిమాలపై విమర్శలు చేయడానికి ఇలాంటి అవకాశాలు కోసం ఎదురు చూస్తూ.. ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నామని ముందుకు వస్తుంటారని సందీప్ రెడ్డి తెలిపారు. ఇలాంటి ఒక విషాద ఘటనకు కావాల్సింది కేవలం బాధితుల పట్ల సానుభూతి మాత్రమే కానీ,మీ స్వార్థ ప్రయోజనాలు కోసం ఇలాంటి ఘటనలను ఉపయోగించుకోవడం కాదు ఈ రెండింటి మధ్య తేడాలను తెలుసుకోండి అంటూ ఈయన కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇలా సందీప్ రెడ్డి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలకు కారణమైంది.

Also Read: గ్యాంబ్లింగ్ థ్రిల్లర్ గా ‘పాకెట్ రాకెట్స్’ టీజర్.. నిహారిక ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?

Related News

లెజెండ్ సినిమాపై రాధిక ఆప్టే కామెంట్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన ఎస్కేఎన్!

సంచలనం రేపుతున్న ఫిల్మ్ ఛాంబర్ కూల్చివేత కుట్ర! గుండెకాయ లాంటి భవనాన్ని మింగేస్తున్న పెద్దల స్వార్థం?

బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన ప్యాంట్ వెనుక ఇంత స్టోరీ ఉందా?

‘కింగ్ 100 ‘ అప్డేట్.. టబు బర్త్ డే సర్ప్రైజ్.. పూనకాలు పక్కా..!

గ్యాంబ్లింగ్ థ్రిల్లర్ గా ‘పాకెట్ రాకెట్స్’ టీజర్.. నిహారిక ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?

యశ్ కోసం రామాయణ రిజెక్ట్ చేసిన నటి…నీ పిచ్చి తగలెయ్యా !

విశ్వక్ సేన్ ‘ఈఎన్‌ఈ రిపీట్’ ట్రైలర్ రిలీజ్… విజయ్ దేవరకొండ వాయిస్ తో…

Big Stories

Advertisement
×