Shalini Pandey:షాలిని పాండే..టాలీవుడ్లో ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని తన వైపుకు తిప్పుకున్న ఈ అమ్మడు ఎందుకనో ఆ తర్వాత ఆ ఫేమ్ ని కంటిన్యూ చేయలేకపోయింది.
అయితేనేం సినిమాలని అడపాదడపా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ తన అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బికినీ ఫోటో ఇపుడు నెట్టింట మంటలు పెడుతున్నాయి.
తాజాగా షాలిని పాండే తన ఇంస్టాలో ఎరుపు రంగు టూ పీస్ బికినీలో అద్దం ముందు తీసుకున్న ఒక సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేసింది. అంతేకాదండోయ్..ఈ ఫోటో కింద ‘Things that lit me up’ అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.ఇక ఫోటోలలో స్టైలిష్, సింపుల్‌గా కనిపించడంతో షాలిని ఈజ్ వన్ అండ్ ఓన్లీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.
తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిన, తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిన చిన్న చిన్న క్షణాలు అంటూ క్యాప్షన్ తో నెట్టింట సందడి చేస్తున్న ఈ ఫోటోలు ఫాన్స్ ని ఫిదా చేస్తున్నాయని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.మరి ఇది ఎవరికోసం అనేది చెప్పనప్పటికీ ఈ క్యూట్ పోస్ట్ మాత్రం అభిమానులను బాగా మెస్మరైజ్ చేస్తుంది.
ఇక షాలిని పాండే సినీ కెరీర్ విషయానికి వస్తే.. 2017లో విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ ఆమె జీవితాన్ని ఒక మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో ప్రీతిగా షాలిని పాండే యాక్టింగ్ టాప్ నాచ్. అలా ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత సావిత్రి బయోపిక్ అయిన ‘మహానటి’ సినిమాలో సుశీల పాత్రలో కనిపించి మెప్పించింది కూడా.
ఇక అలాగే ‘118’, ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘నిశ్శబ్దం’ వంటి సినిమాలతో పలకరించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో అడుగుపెట్టి తన లక్ ని టెస్ట్ చేసుకుంది .రణ్వీర్ సింగ్‌తో కలిసి నటించిన ‘జయేష్‌భాయ్ జోర్దార్’ సినిమాతో బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత ‘మహారాజ్’ వంటి సినిమాల్లో తన సత్తా చాటింది.అలాగే తమిళంలో ధనుష్‌తో కలిసి ‘ఇడ్లీ కడై’ చిత్రంలోనూ కీలక పాత్రలో మెరిసిన ఈ భామ నాకు బాషా బ్యారియర్స్ లేవంటూ అన్ని భాషలని చుట్టేయడం విశేషం.
అయితే షాలిని పాండే కెరీర్ లో కాస్త స్లో అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రంఫాలోవర్స్ గట్టిగానే ఉన్నారండోయ్.చూడాలి మరి బికినీ పిక్ తో కుర్రాళ్ళ గుండెల్లో గునపాలు దించుతున్న ఈ భామ ముందు ముందు ఎలాంటి సినిమాలతో పలకరిస్తుందో !
ALSO READ :ఇళయరాజా, భారతీరాజా మధ్య గొడవకు కారణం అదేనా?