E-Paper
Advertisement

ఇళయరాజా, భారతీరాజా మధ్య గొడవకు కారణం అదేనా?

ఇళయరాజా, భారతీరాజా మధ్య గొడవకు కారణం అదేనా?
Advertisement

Bharathiraja:భారతీరాజా ..అప్పటిదాకా సాగుతున్న మూస సినిమాలని తనదైన టేకింగ్ తో మరో మలుపు తిప్పిన ఈ లెజెండ్రీ ఫిలిం మేకర్ కొంతకాలం కిందటే కన్నుమూసిన సంగతి తెల్సిందే. అయితే ఆయన కెరీర్ మొదట్లో పడ్డ కష్టాల గురించి, బాలు చేసిన సాయం గురించి అలాగే ఇళయరాజాతో భారతీ రాజా కి జరిగిన గొడవ గురించి ఇలా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి వాసురావు .

ఈ సందర్భంగా సాలూరి వాసూరావ్ మాట్లాడుతూ ’16 వయతినిలే’ సినిమా తీసే సమయంలో భారతీరాజా పెద్ద రిస్కే చేశారని, అప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న కమల్‌హాసన్‌ను అందంగా కాకుండా, ఒక సాధారణ పల్లెటూరి కుర్రాడి పాత్రలో చూపిస్తానంటే అందరూ భయపడ్డారని చెప్పుకొచ్చారు. జనాలు ఆసినిమాను చూస్తారా అని ఎంతో మంది డౌట్స్ రైజ్ చేశారని,కానీ భారతీ రాజా మాత్రం తీస్తే కమల్‌తోనే ఆ సినిమా చేస్తానని, లేదంటే సినిమానే ఆపేస్తానని పట్టుబట్టారని ఆనాటి రోజులని గుర్తుచేసుకున్నారు.

Advertisement

అయితే అంతటి గొప్ప కథ, స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నా అప్పట్లో ఆయన పరిస్థితి చాలా దీనంగా ఉండేదని, ఉండటానికి సొంత ఇల్లు కూడా లేక ఇతరులతో కలిసి ఉండేవారని వాపోయారు సాలూరి. తన దగ్గర ఉన్న స్క్రిప్ట్‌ను భద్రపరుచుకోవడానికి కూడా ప్లేస్ లేక, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గదిలోని అటక మీద పెట్టేవారని భారతీ రాజా పరిస్థితి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. బాలు కూడా ఎన్నిసార్లు హీరోను మార్చి సినిమా చేయి అని సలహా ఇచ్చినా భారతీరాజా వెనక్కి తగ్గలేదని చివరకు కమల్ డేట్స్ దొరకగానే ఎంతో ఆనందంగా బాలు దగ్గరికి వెళ్ళాడని,దాంతో బాలు మంచి బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేశారని తెలిపారు.

ముఖ్యంగా సినిమాలలో హీరో ఎంట్రీల విషయంలోనూ భారతీరాజా ఆలోచన వేరేలా ఉండేదని, రెగ్యులర్ గా మొదటి సీన్‌లోనే భారీ ఎలివేషన్లు, విజిల్స్ కొట్టించే సీన్లు ఉండకూడదని, కథలో పాత్ర ఎలా రావాలంటే అలాగే రావాలని నమ్మేవారని భారతీ రాజా టేకింగ్ గురించిమ సినిమా పట్ల ఆయన ఆలోచన గురించి చెప్పుకొచ్చాడు.ఇక రజనీకాంత్, కమల్‌హాసన్ నటించిన సీన్స్ ని కూడా ఆర్టిఫిశియల్ గా కాకుండా చాలా సహజంగా తీశారని, స్టూడియో సెట్ల కంటే ఊర్లని ,అక్కడుంటే నేచర్ నే బాగా ఇష్టపడేవారని తెలిపారు.

Advertisement

ఇక ఇదే ఇంటర్వ్యూలో అద్భుతమైన మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన ఇళయరాజా, భారతీరాజా మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయని చెప్పారు. బయటివాళ్ళ మాటల వల్ల వీరి మధ్య గ్యాప్ వచ్చిందని, ఒకసారి ఇళయరాజా ఇకపై మీ సినిమాలకు పనిచేయను అని అన్నప్పుడు భారతీరాజా అస్సలు కోప్పడకుండా చాలా ప్రశాంతంగా.. నీకు ఎప్పుడూ చేయాలనిపిస్తే అప్పుడే చేయి, నేనైతే నిన్ను అడగను అని చెప్పారని ఈ సందర్భంగా అసలు విషయం చెప్పుకొచ్చారు సాలూరి !

ALSO READ :తారక్‌ను గ్లోబల్ స్టార్ అవుతావని ముందే చెప్పా.. రాజీవ్ కనకాల!

Tags

Related News

ఫ్యామిలీ కథలే ఎందుకు తీస్తారు? రిపోర్టర్‌కు త్రివిక్రమ్ అదిరిపోయే కౌంటర్!

అర్జున్ రెడ్డి బ్యూటీ అందాల షో.. మామూలుగా లేదుగా!

తారక్‌ను గ్లోబల్ స్టార్ అవుతావని ముందే చెప్పా.. రాజీవ్ కనకాల!

మైనస్ నుంచి జీరోకి.. సుమతో కలిసి రాజీవ్ కనకాల పడిన కష్టాలు తెలిస్తే కన్నీళ్లే!

బిగ్‌బాస్ బ్యూటీ ఆయేషా ఖాన్ కొత్త లుక్.. చీరలో ఇంత అందంగా ఉందేంటి!

ప్రభాస్ డేట్స్ వల్లే స్పిరిట్ వాయిదా పడిందా? అసలు విషయం ఇదే!

RC 17కి ముహూర్తం ఫిక్స్.. ఆ రోజే గ్రాండ్ ఓపెనింగ్!

Big Stories

Advertisement
×