E-Paper
Advertisement

కనిపించకుండా పోయిన తల్లి కోసం భయంకరమైన ద్వీపానికి… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్

కనిపించకుండా పోయిన తల్లి కోసం భయంకరమైన ద్వీపానికి… రాత్రిపూట ఒంటరిగా చూడకూడని సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Psychological Mystery Thriller Series: హారర్ సినిమాలలోనూ సరికొత్త ఫోక్ హారర్ మూవీస్ ప్రత్యేకంగా, తాజాగా ఉంటాయి. ఓటీటీ మూవీ లవర్స్ కు ఆ అనుభూతిని పంచడానికి వస్తున్న వెబ్ సిరీస్ ‘బలారా బ్లడ్ ఐలాండ్’ (Balaraw Blood Island). ఫిలిపినో బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతుచిక్కని రీతిలో కనిపించకుండా పోయిన తన తల్లి ఆచూకీ వెతుక్కుంటూ ఒక భయంకరమైన, ఒంటరి దీవికి వెళ్లే యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మరి ఈ భయంకరమైన సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్న వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే… 

సబీనా టెజెరోస్‌ తల్లి చాలా ఏళ్ల క్రితమే కనిపించకుండా పోతుంది. ఆమె ఏమైంది, ఎక్కడికి వెళ్లింది అనే ప్రశ్నలకు సబీనాకు సమాధానాలు దొరకవు. అయితే ఓ రహస్యమైన ఆధారం ఆమెను బలారావ్‌ ద్వీపం వైపు నడిపిస్తుంది. ఆ ద్వీపం గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అక్కడికి వెళ్లిన చాలామంది తిరిగి కనిపించలేదనే భయంకరమైన టాక్ కూడా ఉంటుంది. అయినా తల్లి గురించి నిజం తెలుసుకోవాలనే పట్టుదలతో సబీనా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది.

Advertisement

ఈ ప్రయాణంలో సబీనాకు తోడుగా ఆమె ప్రేయసి బులాక్ బెర్నాబే ఉంటుంది. ఇద్దరూ ఆ ద్వీపానికి చేరుకున్నాక అక్కడి వాతావరణం, స్థానికుల ప్రవర్తన, తరతరాలుగా కొనసాగుతున్న నమ్మకాలు వారిలో అనేక అనుమానాలు రేకెత్తిస్తాయి. మొదట తల్లి ఆచూకీ కోసం మొదలైన అన్వేషణ క్రమంగా ఆ కుటుంబానికి సంబంధించిన దాచిన రహస్యాల వైపు మళ్లుతుంది. బలారావ్‌ ద్వీపం కేవలం ఓ మారుమూల ప్రాంతం మాత్రమే కాదు. అక్కడి జానపద కథలు, వింత ఆచారాలు, ఎవరికీ తెలియని చీకటి రహస్యాలు సబీనా ప్రయాణాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ఆమె తెలుసుకోవాలనుకుంటున్న నిజం ఒక్కొక్కటిగా బయటపడుతున్న కొద్దీ, తన కుటుంబం గురించి ఇప్పటివరకు నమ్మిన విషయాలనే ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. సబీనా తల్లి రెబెక్కా గతంలో ఏం జరిగింది ? ఆమె కనిపించకుండా పోవడానికి అసలు కారణమేంటి ? ఇంతకీ ఆమె తల్లి ఏమైంది ? చివరకు దొరికిందా లేదా ? ఆ ద్వీపంలో ఏం జరుగుతోంది ? అన్నది తెలియాలంటే సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే ?

హర్రర్ సిరీస్ ‘బలారా బ్లడ్ ఐలాండ్’ అక్టోబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. హారర్‌ కథల్లో కొత్తదనం, జానపద కథలు, మూడనమ్మకాల నమ్మకాల చుట్టూ అల్లుకున్న మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్‌ కోరుకునేవారు ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వొద్దు. ఇందులో జానిన్ గుటియెరెజ్‌ సబీనాగా, చార్లీ డిజోన్‌ బులాక్‌గా, అగోట్ ఇసిడ్రో రెబెక్కాగా నటించారు. దర్శకురాలు రే రెడ్‌ ఫిలిపినో జానపద నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ కథను తెరకెక్కించారు. హారర్, మిస్టరీ జోనర్ సినిమాలను ఇష్టపడే హార్డ్‌కోర్ ఫ్యాన్స్‌కు ఇదొక విజువల్ ఫీస్ట్ లాంటిది. ముఖ్యంగా ఆ బ్లడ్ ఐలాండ్ నేపథ్యం, అక్కడ కనిపించే విచిత్రమైన శిల్పాలు, మనుషుల ప్రవర్తన ప్రతీది సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతున్న ఈ సిరీస్‌ను వీకెండ్ నైట్ చూసి మీ ధైర్యాన్ని పరీక్షించుకోండి.

Advertisement

Read Also: డాక్టర్లకే అంతుచిక్కని మెడికల్ మిస్టరీ… ఓటీటీలో తెలుగులో వచ్చేసిన మైండ్ బ్లాక్ మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్

Tags

Related News

హాస్టల్‌లో అమ్మాయిలు మిస్సింగ్‌… గుర్రంపై తలలేని మొండెం… వైరల్‌ హారర్‌ సిరీస్‌ వచ్చేసిందోచ్

దెయ్యాలతో హాలోవీన్‌ సెలబ్రేషన్స్… అద్దంలో అరాచకం… నవ్విస్తూనే భయపెట్టే సిరీస్‌

స్కూల్‌ టాయిలెట్‌లో గ్యాంగ్‌స్టర్‌ను బంధించే బుడ్డోడు… విజయ్ సేతుపతి క్రేజీ కామెడీ తెలుగులోనూ స్ట్రీమింగ్

ప్రపంచాన్నే వణికించిన రియల్ డాన్‌… దశాబ్దాల పరార్‌కు తెరదించిన అరెస్ట్‌… ట్రూ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

పిచ్చాసుపత్రి బేస్మెంట్లో సైకోపాత్… మిస్సైన అమ్మాయి కోసం వేట… గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

కష్టాల మధ్య చిగురించిన ప్రేమ… టామ్ క్రూజ్‌, నికోల్ కిడ్‌మన్‌ల క్లాసిక్‌ రొమాంటిక్ డ్రామా

పిల్లలు పుట్టరని తెలిసి షాకింగ్ డెసిషన్… దత్తత తీసుకోవాలనుకుంటే ఇదెక్కడి దారుణం ?

Big Stories

Advertisement
×