Jr NTR -Trivikram : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా, గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న తారక్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తర్వాత దేవర (Devara)సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ కొట్టారు. ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ఇలా ఒక వైపు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పట్ల బిజీబిజీగా గడుపుతున్నారు.
మురగ పుస్తకం..
ఇక త్వరలోనే బాలీవుడ్ చిత్రం వార్ 2(War 2) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది హృతిక్ రోషన్ తో కలిసిన నటించిన ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పనులలో తారక్ ఎంతో బిజీగా గడుపుతూ నిత్యం ముంబై టు హైదరాబాద్ ప్రయాణం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఎన్టీఆర్ ముంబై ఎయిర్ పోర్ట్ లో మీడియా కంటికి కనిపించారు అయితే ఈయన చేతిలో “మురుగ పుస్తకం” (Muraga Book)పట్టుకొని కనిపించడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
త్రివిక్రమ్ సినిమా కోసమేనా..
సాధారణంగా ఎన్టీఆర్ బయట ఎక్కడైనా కనిపించిన చేతిలో పుస్తకంతో కనిపించిన సందర్భాలు ఎక్కడా లేవు. కానీ మొదటిసారి ఈయన మురుగ పుస్తకం పట్టుకొని కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో చేయబోయే ప్రాజెక్టు కోసం ఎన్టీఆర్ చాలా గట్టిగా ప్రిపేర్ అవుతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో కుమారస్వామి కథతో సినిమా రాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగ వంశీ కూడా ఓ సందర్భంలో వెల్లడించారు.
#JrNTR spotted at Mumbai airport holding the book 'Muruga: The Lord of War, The God of Wisdom' by Anand Balasubramanian. pic.twitter.com/Qp71q6FdKL
— Gulte (@GulteOfficial) June 26, 2025
కుమారస్వామిగా…
ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతుంది. అందుకు అనుగుణంగానే కుమారస్వామికి సంబంధించిన అన్ని విషయాలను స్పష్టంగా తెలుసుకొనే పనిలో ఎన్టీఆర్ నిమగ్నమయ్యారు. అయితే ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు త్వరలోనే అన్ని విషయాలు అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ ప్రాజెక్టు పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా ఉండబోతుందని , ఈ సినిమా తర్వాతనే దేవర2, నెల్సన్ తో సినిమాలు ఉండబోతున్నాయని సమాచారం.
Also Read: కన్నప్పపై స్టార్ ప్రొడ్యూసర్ రివ్యూ… ఇదేంటి తేడాగా ఉంది