BigTV English

Kannappa Review : కన్నప్పపై స్టార్ ప్రొడ్యూసర్ రివ్యూ… ఇదేంటి తేడాగా ఉంది

Kannappa Review : కన్నప్పపై స్టార్ ప్రొడ్యూసర్ రివ్యూ… ఇదేంటి తేడాగా ఉంది

Kannappa Review: మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప(Kannappa) అనే మైథాలజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా మరికొన్ని గంటలలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంచు విష్ణు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఎలాగైనా ఈ సినిమాతో మంచి హిట్ అందుకోవాలని కసి ఆయనలో స్పష్టంగా కనబడుతోంది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో ప్రీమియర్ వేశారు. పలువురు సినీ సెలబ్రిటీలు, దర్శకనిర్మాతలు ఈ ప్రీమియర్ షో చూసిన అనంతరం సినిమా గురించి వారి అభిప్రాయాలను తెలియజేశారు.


రివ్యూ ఇచ్చిన కోన వెంకట్..

ఈ క్రమంలోనే కన్నప్ప ప్రీమియర్ చూసిన వారిలో నిర్మాత కోన వెంకట్ (Kona Venkat)కూడా ఒకరు. ఈ సినిమా చూసినా అనంతరం ఈయన తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. “కన్నప్ప సినిమా విడుదలకుండానే చూసే అవకాశం తనకు వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నానని కోన వెంకట్ తెలిపారు. ఈ సినిమాలో మంచు విష్ణు నటన అద్భుతంగా ఉందని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తూ, ఆకట్టుకుంటుందని తెలిపారు. చివరి అరగంట ప్రేక్షకులు కన్నార్పకుండా సినిమా చూస్తారని, ఈ అరగంట సినిమాకు ప్రేక్షకులు మంత్రముగ్ధులు అవుతారని ఈయన సినిమాపై తన అభిప్రాయాన్ని తెలిపారు.


విష్ణు నట విశ్వరూపం…

ఇక ఈ సినిమాకు ప్రభాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. చివరి 20 నిమిషాలలో విష్ణు నట విశ్వరూపం చూస్తారని, సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా విష్ణు నటన గురించి కచ్చితంగా మాట్లాడుకుంటారని కోన వెంకట్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత మోహన్ బాబు కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలో నటించారు. తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని, కష్టకాలంలో ఉన్న ఇండస్ట్రీకి ఈ సినిమా మంచి విజయాన్ని తీసుకువస్తుంది” అంటూ సినిమాపై భారీ అంచనాలు కలిగేలా ఈయన తన అభిప్రాయాన్ని తెలిపారు.

క్లైమాక్స్ హైలెట్..

ఈ విధంగా కోన వెంకట్ కన్నప్ప సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇదేంటి ఇలా రివ్యూ ఇచ్చారు అంటు కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు కేవలం 20 నిమిషాలు మాత్రమే సినిమాలో హైలెట్స్ ఉండబోతున్నాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నో అంచనాల నడుమ విష్ణు కన్నప్ప జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈయన తెరపై కనిపించబోతున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగానే ఎదురుచూస్తున్నారని చెప్పాలి. ఎన్నో అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమా విష్ణు కెరియర్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియాల్సి ఉంది.

Also Read: కన్నప్ప ఫ్లాప్ అయితే… కుబేర నుంచి బిగ్ సర్ప్రైజ్

Related News

Akhanda 2 : ఆ రిసార్ట్ లో పార్టీ చేసుకుంటున్న అఖండ 2 టీం

The Raaja Saab : ఎందుకండీ ఈ త్యాగాలు? అక్కడ లేటుగా రాజా సాబ్ రిలీజ్

Avika Gor: ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో అవికా గోర్.. ఘనంగా మెహందీ వేడుక!

Chiranjeevi: చిరంజీవిపై బాలయ్య వ్యాఖ్యలు.. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఆందోళనలు!

Raja Saab Trailer: రాజా సాబ్ ట్రైలర్ వచ్చేసింది, ఇక రెచ్చిపొండి డార్లింగ్స్ 

Srinidhi Shetty: రామాయణ అసలు సీత శ్రీనిధి శెట్టినా…మరి సాయి పల్లవి ?

Sobhita Dhulipala : తమిళ్ ప్రాజెక్టుకు శోభిత గ్రీన్ సిగ్నల్, క్రేజీ కాంబినేషన్ కంప్లీట్ డీటెయిల్స్

OG Movie: ఓజీతో హిస్టరీ క్రియేట్‌ చేసిన పవన్‌.. ఏకంగా ఆ రికార్డు బ్రేక్..

Big Stories

×