BigTV English

Jyothika: బికినీలో జ్యోతిక.. సూర్యతో కలిసి వెకేషన్ లో రచ్చ

Jyothika: బికినీలో జ్యోతిక.. సూర్యతో కలిసి వెకేషన్ లో రచ్చ

Jyothika: ఇండస్ట్రీలో అడోరబుల్ కపుల్ లిస్ట్ తీస్తే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య- జ్యోతిక జంట పేరు మొదటి వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మధ్యకాలంలో హీరోలు హీరోయిన్లు విడాకులు తీసుకుంటూ విడిపోతున్న వార్తలు ఎన్నో వింటూనే ఉన్నాం. కానీ, వివాహానికి కట్టుబడి.. భర్త మాట భార్య, భార్య మాట భర్త వింటే ఆ జంట ఎలా ఉంటుందో తెలపడానికి సూర్యజ్యోతిక జంటను చూపిస్తే చాలు అని నెటిజన్స్ వారిపై ఎప్పటికప్పుడు ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. సూర్య, జ్యోతిక జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వహించిన ఖాఖా ఖాఖా సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.


 

పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జ్యోతిక వారి అలనా పాలనా చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది. ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక జ్యోతిక రీ ఎంట్రీ ఇచ్చింది. ఒకపక్క నటిగానే కాకుండా ఇంకోపక్క నిర్మాతగా కూడా మారి పలు సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా మారారు. ఇక పెద్ద కోడలిగా ఆమె సూర్య ఇంటిని ఉమ్మడి కుటుంబంగానే ఉంచుతూ వచ్చింది. ఎన్నోసార్లు కార్తీ.. జ్యోతిక తన  వదిన కాదని తల్లి అని చెప్పుకొచ్చాడు. ఆమె వల్లే తామందరం కలిసి ఉంటున్నామని కూడా తెలిపాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ గతేడాది సూర్య- జ్యోతిక ఫ్యామిలీ చెన్నై నుంచి ముంబైకి మకాం మార్చారు.


 

అయితే అత్తమామలతో జ్యోతికకు పొసగడం లేదని అందుకే ముంబై కు షిఫ్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి. కానీ, సూర్య మాత్రం పిల్లల చదువుల కోసం మాత్రమే తమ ముంబై కి వెళ్ళామని అంతేకాకుండా ముంబై నుంచి వచ్చిన జ్యోతిక నాకోసం నా కుటుంబం కోసం ఎంతో చేసిందని ఇప్పుడు ఆమెకు తన జీవితాన్ని తిరిగి ఇచ్చేయాలని ప్రయత్నించానని.. అందుకే ముంబైలో ఇల్లు తీసుకొని ఆమెకు తన స్నేహితులను దగ్గర చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక ముంబై వెళ్ళిన తర్వాత జ్యోతిక బాలీవుడ్ లో  మంచి మంచి అవకాశాలను అందుకుంటూ బిజీగా మారింది. ఈ మధ్యనే డబ్బా కార్టెల్ సిరీస్ లో  కనిపించిన జ్యోతిక మరో రెండు సినిమాలు తో బిజీగా మారింది.

 

తాజాగా సూర్య- జ్యోతిక  ప్రొఫెషనల్ లైఫ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ మధ్యనే ఈ జంట తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్ కు  విహారయాత్రకు వెళ్లారు. సముద్రం, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఈ జంట ప్రకృతిలో మమేకం అయ్యారు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను జ్యోతిక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘స్వర్గంలో మరో రోజు మనిద్దరం’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక మునుపెన్నడూ చూడనిరీతిలో బికినీ లుక్ లో జ్యోతిక కనిపించింది. సముద్రం ఒడ్డున బికినీలో జ్యోతిక ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సూర్య కేరీర్ విషయానికొస్తే ప్రస్తుతం తెలుగులో వెంకీ అట్లూరితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకోపక్క బాలాజీ దర్శకత్వంలో కరుప్పు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

?utm_source=ig_web_copy_link

Related News

Jailer 2 : హైదరాబాదులో రజనీకాంత్, షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే?

Akhanda 2: అఖండ 2 లో ‘గంజాయి’… బాలయ్య నుంచి మరో మెసేజ్

Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే కాదండోయ్.. సీరియల్ కూడా చేశారని తెలుసా.. ఏదంటే?

Actress: డైరెక్టర్ కట్ చెప్పినా.. ముద్దులు పెడుతూనే ఉన్న హీరోయిన్, పెళ్లయినా ఇదేం పాడుబుద్ధి

Rashmika Mandanna: నమ్మలేకపోతున్నా.. విజయ్‌ ఫొటోలతో రష్మిక అలాంటి కామెంట్స్, దాచినా దాగవులే!

Balakrishna: రైట్ .. రైట్..ఆర్టీసీ డ్రైవర్ గా మారిన బాలయ్య..వీడియో వైరల్!

Big Stories

×