Anchor Swetcha Case: పూర్ణ చందర్ తనకు నాలుగేళ్లుగా తెలుసని చెప్పింది స్వేచ్ఛ కూతురు. అమ్మ ముందు తనపై ప్రేమ ఉన్నట్లు చాలా యాక్టింగ్ చేసేవాడంది. తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించే వాడని ఆరోపించింది ఆ చిన్నారి. ఇవన్నీ అమ్మకు చెప్తే నమ్మలేదు. పూర్ణచందర్‌ను ఫాదర్‌లా ఫీల్ అవ్వమని చెప్పింది. అమ్మ బాధపడకుండా ఉండాలని అతనితో క్లోజ్‌గా ఉండేదాన్ని అని చెప్పింది ఆ చిన్నారి. ఎగ్జామ్ ఉన్నా తనతో పని చేయించేవాడని వాపోయింది. మా అమ్మ పూర్ణచందర్‌తో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్ అని తరచు గొడవ పడుతూ ఉండేదని చెప్పింది. తనను, వాళ్ల అమ్మకు దూరం చేశాడని ఏడ్చింది స్వేచ్ఛ కూతురు. పూర్ణచందర్‌ను వాళ్ల అమ్మ చెప్పుతో, తన చెప్పుతో కొట్టాలని తెలిపింది. తర్వాత ఉరి తీయాలని కోరింది స్వేచ్ఛ కూతురు.
మరోవైపు యాంకర్ స్వేచ్ఛ మృతికి కారణం పూర్ణచందర్ అని ఆమె తండ్రి కూడా ఆరోపించారు. ప్రేమ పేరుతో స్వేచ్ఛను మూడేళ్లు వేధించారని చెప్పారు. పూర్ణచందర్ చాలా మోసగాడని, తన మనవరాలితో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. అతను అమ్మాయిల పిచ్చోడని, ఎంతో మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని మండిపడ్డారు. పూర్ణచందర్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఆత్మహత్య చేసుకున్న యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణచందర్ నాయక్ పోలీసులకు లొంగిపోయారు. నిన్న రాత్రి 11గంటలకు అడ్వకేట్ సమక్షంలో పూర్ణచందర్ నాయక్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. స్వేచ్చ పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తన కూతురు ఆత్మహత్యకు పూర్ణచందర్ నాయక్ కారణమని స్వేచ్ఛ తండ్రి ఫిర్యాదు చేశారు. భర్తతో స్వేచ్ఛ విడిపోయాక.. పూర్ణచందర్‌తో కలిసి ఉంటుందోని తెలిపారు. అయితే కొన్నాళ్లుగా వీళ్లద్దరి మధ్య గొడవలు ఉన్నాయని.. ఆ కారణంతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని స్వేచ్ఛ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
లొంగిపోయిన అనంతరం పూర్ణచందర్ మీడియాకు లేఖను విడుదల చేశారు. అందులో స్వేచ్ఛకు తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆమె కుటుంబ సభ్యుల తీరు వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆ లేఖలో రాసుకొచ్చారు. ఆమె తల్లిదండ్రులు చిన్ననాటి నుంచీ తనను ఒంటరిగా వదిలేశారని సరిగా పట్టించుకోలేదని స్వేచ్ఛ ఎన్నో సందర్భాలలో తన దగ్గర బాధ పడిందన్నారు.
Also Read: నా తప్పు లేదు మొత్తం అతని వల్లే..! పూర్ణచంద్ర సంచలన లెటర్
యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న రాత్రి అడ్వకేట్‌తో వచ్చిన పూర్ణచందర్‌ను పోలీసులు అదపులోకి తీసుకున్నారు. మృతురాలి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పూర్ణచందర్‌ను వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. కుతూరి స్టేట్మెంట్‌తో పూర్ణచందర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇదిలా ఉంటే.. స్వేచ్ఛ సూసైడ్ కేసులో ఆమె పేరెంట్స్ ఆరోపించినట్లు హత్య కోణం ఏమీ లేదని పూర్ణచందర్ అడ్వకేట్ శ్రావణ్ అన్నారు. పోక్సో కేసు నమోదైనట్లు తన దృష్టికి రాలేదని అన్నారాయన. మరికొద్ది సేపట్లో పూర్ణచందర్‌ను కోర్టులో హాజరుపరుస్తారని తెలిపారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో తెలియదన్నారు.