Mass jathara:ఒకప్పుడు మాస్ మహారాజా రవితేజ(Raviteja ) శ్రీ లీలా(Sreeleela ) కాంబినేషన్లో ‘ధమాకా’ సినిమా వచ్చి మంచి విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీట్ కాబోతోంది. అదే ‘మాస్ జాతర’. మళ్ళీ రవితేజ, శ్రీ లీల రచ్చ చేయడానికి సిద్ధం అయిపోయారు. భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది.ఇప్పుడు ఎట్టకేలకు అక్టోబర్ 31వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది ఈ సినిమా..
ఇకపోతే తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. దీన్ని బట్టి చూస్తే పిల్లలు , పెద్దలు ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమాగా సెన్సార్ డిసైడ్ చేసింది. ఇకపోతే ఈ సినిమాకి 160 నిమిషాల రన్ టైమ్ ను లాక్ చేశారు. అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ చిత్రానికి ఒకరోజు ముందుగా అనగా అక్టోబర్ 30వ తేదీన ప్రీమియర్ వేయబోతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న మాస్ జాతర రవితేజకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
మరొకవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో RT76 అనే వర్కింగ్ టైటిల్ తో వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.ఈ సినిమా విడుదలకు కేవలం రెండు నెలలే టైం ఉన్నా ఇంకా టైటిల్ రిలీజ్ చేయలేదు. పైగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు కూడా పెద్దగా వెలువడకపోవడం గమనార్హం.
ప్రముఖ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు హీరోయిన్ గా.. మరొకవైపు వందల కోట్ల విలువైన యాడ్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మాస్ జాతర సినిమాతో రాబోతున్న ఈమె మరొకవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ తో ఒక సినిమా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే పరాశక్తి సినిమాలో కూడా నటిస్తోంది. ఇది కోలీవుడ్ చిత్రం కావడం గమనార్హం. ఇలా ఒక చిత్రం తర్వాత మరొక చిత్రంతో బిజీగా మారిపోయింది శ్రీ లీల. ఇప్పుడు ఈమె ఆశలన్నీ మాస్ జాతరపైనే ఉన్నాయి. మరి ఈ సినిమా శ్రీ లీలాకి అటు రవితేజకి మంచి సక్సెస్ ఇవ్వాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు
also read:Film industry: భర్తలేమో డైరెక్టర్స్.. భార్యలేమో ప్రొడ్యూసర్స్.. ఈ ట్రెండ్ ఏదో బాగుందే?
#MassJathara censor done with U/A with runtime of 160 Min. October 31st release. Premieres on 30th…#RaviTeja #MassJatharaOnOct31st #Sreeleela #nagavamsi @RaviTeja_offl @sreeleela14 @vamsi84 @BhanuBogavarapu @SitharaEnts pic.twitter.com/gould1CErg
— BIG TV Cinema (@BigtvCinema) October 25, 2025