Kajal Aggarwal: అందం, అభినయం కలబోసిన రూపం కాజల్ అగర్వాల్. అమ్మడి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ తెలుగు తెరకు పరిచయమైంది. అచ్చ తెలుగు ఆడపడుచులాగా మొదటి సినిమాలో కనిపించగానే తెలుగు ప్రేక్షకులు ఆమెను ఓన్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కాజల్ వరుస సినిమా అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. చందమామ, మగధీర డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మేన్, ఎవడు, టెంపర్ లాంటి మంచి హిట్ సినిమాల్లో ఆమె నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగులో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ పెళ్లి తర్వాత కొద్దిగా జోరు తగ్గించింది.
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే చిన్ననాటి స్నేహితుడు అయినా గౌతమ్ కిచ్లును వివాహమాడి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ఇక అందరి హీరోయిన్స్ లా పిల్లల కోసం అయిదారేళ్ళు వేచి చూడకుండా పెళ్లయిన ఏడాదికే కాజల్ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్స్ సినిమాలకు దూరమవుతారు. కానీ, కాజల్ మాత్రం పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఈ మధ్యనే కన్నప్ప సినిమాతో కాజల్ వెండితెరపై కనిపించింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన కన్నప్ప సినిమాలో కాజల్ .. పార్వతి దేవిగా కనిపించిన విషయం తెలిసిందే. ఆమె కనిపించింది కొంచెం సేపు అయినా కూడా పార్వతీదేవి పాత్రలో కాజల్ ఎంతో అద్భుతంగా నటించిందని చెప్పుకొస్తున్నారు.
ఇక సెలబ్రిటీలు ఎవరైనా సరే కొద్దిగా సమయం దొరికితే చాలు కుటుంబంతో కలసి వెకేషన్ కు వెళుతూ ఉంటారు. తాజాగా కాజల్ సైతం కుటుంబంతో కలిసి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. గత రెండు మూడు సంవత్సరాలుగా కాజల్ సినిమాలు తగ్గించింది అయినా కూడా ఆమె క్రేజ్ మాత్రం కొద్దిగా కూడా తగ్గలేదు. సోషల్ మీడియాలో కాజల్ ఇలా పోస్ట్ పెట్టడం ఆలస్యం అలా ట్రెండింగ్ లోకి మారిపోతాయి. ఈ మధ్యనే కాజల్ తన పుట్టినరోజు వేడుకలను తన చెల్లి నిషా అగర్వాల్ కుటుంబంతో కలిసి జరుపుకుంది.
ఇక ఈ వెకేషన్ లో కాజల్ తన చెల్లి నిషాతో కలిసి బీచ్ లో రచ్చ చేసింది. నిషా కూడా తెలుగువారికి సుపరిచితురాలే. సోలో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది కానీ, ఆ తర్వాత అలాంటి విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో అక్క కన్నా ముందే చెల్లి నిషా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇక అక్క కాజల్ కూడా లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇద్దరు కలిసి తమ కుటుంబాలతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా నిషా అక్కతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. బీచ్ ఒడ్డున బికినీలో ఈ ఇద్దరు అక్కచెల్లెళ్ళు అందాల ఆరబోతతో పిచ్చెక్కించారు. వైట్ బికినీలో కాజల్, బ్లాక్ బికినీలో నిషా థైస్ షో చేస్తూ..కుర్రాళ్లకు కునుకు రానివ్వకుండా చేశారు. కాజల్ ను గట్టిగా పట్టుకొని నిషా ముద్దు పెడుతూ తన ప్రేమను చూపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు అబ్బబ్బ ఏమి అందం ఎవరిని చూడాలో.. ఎవరిని చూడకూడదదో తెలియడం లేదే. అసలు ఆ ముద్దులు ఏంటి .. హగ్గులు ఏంటి .. మమల్ని మీ అందంతో చంపేస్తారా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.