BCCI : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రికెట్ బోర్డు ఏదైనా ఉందంటే.. అది బీసీసీఐ అనే చెప్పవచ్చు. ప్రస్తుతం బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. తాజాగా టీమిండియా జెర్సీకి కొత్త స్పాన్సర్ షిప్ గా అపోలో టైర్స్ ఎంపిక చేసుకుంది.మరోవైపు మరో సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. టీమిండియా మాజీ లెప్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ రుద్రప్రతాప్ సింగ్, అలాగే ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఎంపికైనట్టు సమాచారం. దీంతో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కి చెబ్ పెట్టినట్టు అయింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ప్రస్తుత ప్యానెల్ ఎస్ శరత్ కుమార్, సుబ్రతో బెనర్సీ స్థానంలో వీరిని నియమించినట్టు తెలుస్తోంది.
Also Read : Pakistan : పాక్ కి అవమానం.. తోక ముడిచి, మాట తప్పి.. UAE తో మ్యాచ్ కి ఓకే చెప్పారుగా..!
బీసీసీఐ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇద్దరి పేర్లను సూచించింది. బోర్డు ఎంజీఎం ఇద్దరి పేర్లను ఆమోదించనుంది. ఈ ఇద్దరూ కలిసి అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీతో పని చేయనున్నారు. జూనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మన్ గా ఎస్ శరత్ ఎన్నికయ్యే అవకాశముంది. టీమిండియా కు టీ-20 వరల్డ్ కప్ తొలిసారిగా అందించిన హీరోల్లో ఆర్పీసింగ్ ఒకడు. టెస్ట్ ల్లో భారత్ తరపున అతను అద్భుతంగా ఆడాడు. సెంట్రల్ జోన్ నుంచి వచ్చిన ఈ మాజీ ఆటగాడు ఊపీ తరపున ఎక్కువగా క్రికెట్ ఆడాడు. 2016-17 రంజీ ట్రోఫీని గెలిచిన గుజరాత్ జట్టులో సభ్యుడు. ఈ ఏడాది ఆర్పీ సింగ్ కి 40 ఏళ్లు నిండనున్నాయి. ఆర్పీ సింగ్ టీమిండియా తరపున మొత్తం 82 మ్యాచ్ లు ఆడి 124 వికెట్లను తీశాడు. ఇందులో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ 20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. మాజీ బౌలర్ సుబ్రతో బెనర్జీ స్థానంలో సెలక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
హైదరాబాద్ కి చెందిన మాజీ బౌలర్ ప్రజ్ఞాన్ ఓఝా సైతం సెలక్టర్ గా బాధ్యతలను నిర్వర్తించబోతున్నాడు. ఓఝా టెస్ట్ స్పెషలిస్ట్ కూడా. ఇంటర్నేషనల్ క్రికెట్ లో టీమిండియా తరపున 144 వికెట్లను తీశాడు. ఇందులో 113 వికెట్లు టెస్టుల్లో తీశాడు. 21 వన్డేల్లో, టీ-20 10 వికెట్లను తీశాడు. విశేషం ఏంటంటే..? తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ లో పది వికెట్లు తీసి వార్తల్లో నిలిచాడు. డొమెస్టిక్ క్రికెట్ లో ఎక్కువగా ఓఝా హైదరాబాద్ తరపున ఆడాడు. అదేవిధంగా బెంగాల్, బీహార్ జట్ల తరపున కూడా ఆడాడు. శరత్ స్థానంలో సెలెక్టర్ గా పని చేయనున్నాడు ఓఝా.
తాజాగా బీసీసీఐ కొత్త సెలెక్టర్లను, కొత్త స్పాన్ షిప్ తో డీలింగ్ కుదుర్చుకోవడం.. అంతా కొత్తగా జరుగుతుండటం విశేషం. అపోలో టైర్స్ సంస్థ కి ఒక్కో మ్యాచ్ కి రూ.4.5 కోట్లు బీసీసీఐ చెల్లించనున్నట్టు తెలుస్తోంది. 121 దైపాక్షిక మ్యాచ్ లు, 21 ఐసీసీ మ్యాచ్ లకు కలిపి రూ.579 కోట్లకు స్పాన్సర్ హక్కులు దక్కించుకున్నట్టు సమాచారం. అయితే 2027 వరకు స్పాన్సర్ కు ఉండనున్నట్టు సమాచారం.