Manchu Lakshmi:మంచు మనోజ్ (Manchu Manoj)కి ‘మిరాయ్’ మూవీతో మంచి కమ్ బ్యాక్ వచ్చింది.. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత మనోజ్ మళ్ళీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.. ఇక రీ ఎంట్రీ తర్వాత మనోజ్ చేసిన భైరవం, మిరాయ్ ఈ రెండు సినిమాలు కూడా మనోజ్ ని ఇండస్ట్రీలో నిలబెట్టాయని చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాల్లో ముఖ్యంగా మిరాయ్ మూవీలో మనోజ్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంది అని, ఆయన హీరోగానే కాదు విలన్ గా కూడా తన నట విశ్వరూపాన్ని చూపించారంటూ ఎంతో మంది సినిమా చూసిన జనాలు రివ్యూలు ఇస్తున్నారు. అయితే తాజాగా మనోజ్ రీ ఎంట్రీ పై, మిరాయ్ సినిమా హిట్ పై మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.
మంచు లక్ష్మీ లీడ్ రోల్ పోషించిన ‘ దక్ష- ది డెడ్లీ కాన్స్పిరెన్సీ’ అనే మూవీ తో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 19 అంటే మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి తమ్ముడి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.ఆ ఇంటర్వ్యూలో..” మీ ఫ్యామిలీ లో ఈ ఏడాది విష్ణు కి కన్నప్ప, మనోజ్ కి మిరాయ్ త్వరలోనే మీరు దక్ష మూడు సినిమాలు వచ్చాయి. మీ ఫీలింగ్ ఏంటి?”అని లక్ష్మీని అడగగా..
అదంతా దైవ నిర్ణయం..
“అదంతా దైవ నిర్ణయం…మన చేతిలో ఏమీ లేదు.దక్ష సినిమా సమ్మర్ లో అనుకున్నాం. కానీ దసరా ముందు విడుదల కాబోతోందని చెప్పుకొచ్చింది. మరి దక్ష సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని అడిగితే.. అంచనాలు అంటూ ఏమీ లేవు.పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తే చాలు.అదొక్కటే నేను కోరుకుంటాను. అలాగే నేను ఇప్పటివరకు అన్ని మంచి పాత్రలే ఎంచుకున్నాను. ఇప్పుడు కూడా అలాంటి పాత్రనే ఎంచుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
తమ్ముడి రీ ఎంట్రీ గురించి ఏమన్నారంటే..?
అలాగే మీ తమ్ముడి సక్సెస్ ని ఆయన కంటే మీరు బాగా సెలెబ్రేట్ చేసుకున్నారు.. సెకండ్ ఇన్నింగ్స్ కి మంచి హిట్ అని మీరు భావిస్తున్నారా..? ప్రసాద్ ఐమాక్స్ లో మిరాయ్ మూవీ చూసి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా అని అడగగా.. “నేను ఎవరి సినిమా హిట్ అయినా అలాగే సెలబ్రేట్ చేసుకుంటాను. ఇంట్లో హీరోలైనా సరే..వేరే హీరోలైన నేను ఇలాగే సెలబ్రేట్ చేస్తాను. సినిమాను సెలబ్రేట్ చేస్తాను.. అలాగే మనోజ్ రీ ఎంట్రీ ఇవ్వాలని.. మిరాయ్ మూవీకి ఓకే చెప్పినప్పుడు చాలాసార్లు సినిమా ఆగిపోయింది. దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు. చాలా సార్లు సినిమా షూటింగ్ వాయిదా పడింది. అలాగే మనోజ్ కి కూడా చాలా గ్యాప్ వచ్చింది.అసలు సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారా? అనే డౌట్ ఉండేది. కానీ మిరాయ్ మూవీ క్లియర్ హిట్. నిజంగా ఇది ఒక మిరాకిల్.. ఆ దేవుడి ఆశీస్సులతో మనోజ్ కి మంచి కం బ్యాక్ దక్కింది. దీనికి నేను చాలా సంతోషిస్తాను.
ALSO READ:Mohini: 7సార్లు ఆత్మహత్యాయత్నం.. ఆయనే కాపాడాడంటూ బాలయ్య హీరోయిన్ ఎమోషనల్!
డైరెక్టర్ కి దండం పెట్టాలి..
అలాగే ఈ సక్సెస్ కి మనోజ్ అర్హుడు.. అలాగే మనోజ్ ఈ సినిమా కోసం చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించాడు. ఎందుకంటే ఇంటి దగ్గర చాలా తుంటరిగా, హై ఎనర్జీతో ఉంటాడు. ఇక తన ఎనర్జీని సినిమాలో తన విలనిజంతో కలిపి చూపించాడు..ఈ సినిమాలో మనోజ్, శ్రేయ, తేజ వీళ్ళందర్నీ పక్కన పెడితే డైరెక్టర్ కి రెండు చేతులెత్తి దండం పెట్టాలి. సినిమాలో ఒక్క పాట కూడా లేకుండా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించాడు.
డైరెక్టర్ పై ఊహించని కామెంట్స్..
ఇక ఈ సినిమా చేయడానికి డైరెక్టర్ ఎంతమంది దగ్గర తిట్లు పడ్డాడో తెలియదు కానీ ఆయన కథని అల్టిమేట్ గా తెరకెక్కించారు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ లను మేం కూడా తీస్తాం. కానీ ఎక్కడో ఒక దగ్గర తుస్సు మంటుంది. కానీ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాత్రం కథను ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా ఎంతో ఇంట్రెస్టింగ్ గా సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా చూస్తే నాకు పిచ్చెక్కింది” అంటూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది మంచు లక్ష్మి.