Matching Number Offer: జియో ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లను తీసుకొస్తూనే ఉంటుంది. అదే క్రమంలో ఇప్పుడు మరో కొత్త, వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ ఇది నిజంగానే ప్రత్యేకం అని అనిపించే ఆఫర్. ఎందుకంటే కుటుంబ సభ్యులు, స్నేహితులందరికీ ఒకే తరహా నంబర్ చివరి అంకెలతో కొత్త కనెక్షన్ పొందే అవకాశం ఇప్పుడు జియో అందిస్తోంది. కేవలం 50 రూపాయలతో ఈ సౌకర్యం లభించడం వినియోగదారులందరికీ ఒక బంగారు అవకాశం అని చెప్పవచ్చు.
మొబైల్ నంబర్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కానీ ఆ నంబర్ చివరి అంకెలు ఒకేలా ఉంటే గుర్తుపెట్టుకోవడం చాలా సులభం అవుతుంది. అలాగే ఒక కుటుంబం మొత్తం లేదా స్నేహితుల గ్రూప్ మొత్తం ఒకే తరహా నంబర్‌లను కలిగి ఉండడం ఒక ప్రత్యేకతగా మారుతుంది. ఇప్పుడు ఈ కలను నిజం చేస్తూ జియో ఈ కొత్త మ్యాచింగ్ నంబర్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఉదాహరణకు మీ అమ్మ ఫోన్ నంబర్ చివర 503702 తో ముగిసిందనుకోండి, అయితే మీరు కూడా కొత్తగా తీసుకునే నంబర్ అదే లాస్ట్ డిజిట్స్‌తో ముగుస్తుంది. దీంతో మీ ఇద్దరి నంబర్లలో ఒకే తరహా ఫీలింగ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవడానికే కాదు, ఒక బంధాన్ని, దగ్గరదనాన్ని కూడా చూపిస్తుంది.
Also Read: Flipkart iPhone Offers: 2025లో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ డీల్.. మిస్ అయితే మళ్లీ రాదు!
ఈ ఆఫర్ పొందడం చాలా సులభం. మీ మొబైల్‌లోని మైజియో యాప్‌ను ఓపెన్ చేసి, “మ్యాచింగ్ నెంబర్ ఆఫర్” అనే ఆప్షన్ ఎంచుకుంటే చాలు. మీరు కోరుకున్న నంబర్ లాస్ట్ డిజిట్స్‌ని సెలెక్ట్ చేసుకుని, కేవలం 50 రూపాయలు చెల్లిస్తే కొత్త నంబర్ రిజర్వ్ అవుతుంది. అంతే, కొత్త కనెక్షన్ మీ పేరుమీద రిజిస్టర్ అయిపోతుంది.
ఫ్యామిలీ మొత్తం ఒకే తరహా నంబర్ చివర ఉండటం వల్ల ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఏర్పడుతుంది. ఇది ఒకవైపు సులభతరం, మరొకవైపు బంధాన్ని మరింత దగ్గరగా కట్టిపడేసేలా ఉంటుంది. స్నేహితుల గ్రూప్‌లోనూ ఇదే పరిస్థితి. ఒకే తరహా నంబర్లు ఉండడం వల్ల గ్రూప్‌లో ఒక ప్రత్యేకత ఏర్పడుతుంది.
ఇప్పుడు చాలా మంది తమ బ్యాంక్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్స్, ఆన్‌లైన్ సర్వీసులు అన్నింటికీ మొబైల్ నంబర్లను లింక్ చేస్తుంటారు. అప్పుడు అలాంటి మ్యాచింగ్ నంబర్లు ఉంటే వాటిని గుర్తించడం, గుర్తుంచుకోవడం చాలా ఈజీగా మారుతుంది. ఒకే తరహా నంబర్లు ఉండడం వల్ల తప్పుగా టైప్ చేయడం కూడా తగ్గిపోతుంది.
ముఖ్యంగా ఈ ఆఫర్ కొత్త నంబర్ తీసుకునేవారికే కాకుండా ఇప్పటికే ఉన్న జియో వినియోగదారులకు కూడా వర్తిస్తుంది. అంటే మీ దగ్గర ఇప్పటికే ఒక జియో నంబర్ ఉంటే, కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు మీరు ఈ మ్యాచింగ్ నంబర్ ఆఫర్‌ని ఉపయోగించుకోవచ్చు. ఇది కేవలం ఒక ఆఫర్ మాత్రమే కాదు, వినియోగదారుల మనసు గెలుచుకునే ఒక క్రియేటివ్ ఆలోచన అని చెప్పాలి.