Kamal Haasan:సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే రెండవ సినిమాకి అవకాశం రావడం అంత సులభం కాదు. కానీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఆ ఇంపాక్ట్ పెద్దగా పడదు అని చెప్పాలి. అయితే ఒక్కొక్కసారి వరుసగా డిజాస్టర్లు చవి చూస్తే మాత్రం.. వారితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వచ్చినా.. వారి సినిమా కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు మాత్రం వెనకడుగు వేస్తారు. ఇప్పుడు కమలహాసన్ సినీ కెరియర్ లో కూడా అదే జరుగుతుందని చెప్పవచ్చు. ‘ఇండియన్ 2’ దెబ్బకి డిస్ట్రిబ్యూటర్లు ఇంకా కోలుకోలేదు అనుకునే లోపే.. థగ్ లైఫ్ సినిమాతో వారిని మరింత కృంగదీశారు కమలహాసన్ (Kamal Haasan).శంకర్ (Shankar), మణిరత్నం (Maniratnam) లాంటి స్టార్ డైరెక్టర్ల టేకింగ్, మేకింగ్ కి కూడా దండం పెడుతున్నారు.. అంతేకాదు కమలహాసన్ ఇకపై రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని కూడా సలహాలు ఇస్తూ ఉండడం గమనార్హం.
సినిమాలపై కీలక నిర్ణయం తీసుకున్న కమల్ హాసన్..
నిజానికి గత కొన్ని దశాబ్దాలుగా సినీ జీవితాన్ని ఎంజాయ్ చేసిన ఒక సీనియర్ యాక్టర్ ఒక పట్టాన యాక్టింగ్ కి బ్రేకులు వేయమంటే ఎంతవరకు సాధ్యం..అది జరగని పని.. బ్రతికున్నంత కాలం అలరిస్తూనే ఉంటానని మొన్నా మధ్య చెప్పుకొచ్చారు కూడా.. కానీ కమలహాసన్ గత చిత్రాల ఫలితాలు డిస్ట్రిబ్యూటర్లను ముందడుగు వెయ్యనివ్వడం లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అలాంటి ఈయన ఇప్పుడు ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. కమలహాసన్ ఈమధ్య రాజ్యసభ సభ్యుడిగా సరికొత్త బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి తోడు తన నిర్మాణ సంస్థ ‘రాజ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ లో తప్ప ఇతర ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలలో నటించకూడదని అనుకుంటున్నారట. ప్రస్తుతం విశ్రాంతి లేకుండా ఉన్న షెడ్యూల్స్ వల్లే.. ఇతర ప్రొడ్యూసర్లకి నష్టం వాటిల్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అదే చివరి సినిమా కానుందా?
ప్రస్తుతం కమలహాసన్ అన్బిరవ్ దర్శకత్వంలో ‘#కమల్ 237’ చిత్రాన్ని చేస్తున్నారు. ఆగస్టు మొదటి వారం లేదా రెండవ వారంలో ఈ సినిమా సెట్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshin) హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ చేతిలో కల్కి 2(Kalki 2) కూడా ఉంది. పైగా ఈ రెండు చిత్రాలు ఇతర ప్రొడక్షన్ హౌస్ చిత్రాలే కావడంతో కల్కి 2 చిత్రం తర్వాత ఆయన బయట నిర్మాణ సంస్థల్లో పని చేయకూడదని కండిషన్ పెట్టుకున్నారట. ఒకవేళ ఇతర ప్రొడక్షన్ హౌస్ ల నుండి బిగ్ ఆఫర్లు వస్తే సినిమాలు చేస్తారా..? తప్పని పరిస్థితుల్లో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు తన సొంత బ్యానర్ లోనే సినిమాలు చేయాలని కండిషన్ పెడతారా? అనే విషయాలు తెలియాలి అంటే కమలహాసన్ పూర్తి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తానికి అయితే ఇతర ప్రొడక్షన్ హౌస్ లో చివరిగా నటించాలని అనుకుంటున్న కమలహాసన్ కి నిజంగానే కల్కి 2 చివరి సినిమా అవుతుందా? అనే విషయం తెలియాలి అంటే కమల్ హాసన్ స్పందించే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ప్రస్తుతం కమలహాసన్ కి సంబంధించిన ఈ విషయాలు కోలీవుడ్ మాధ్యమాలలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Samantha: ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. నటనకు మళ్లీ దూరంగా సమంత..కారణం?