Surat Crime: దేశంలో వివాహేతర సంబంధాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఆ ఉచ్చులోపడి భర్తలను లేపేస్తున్నారు భార్యలు. లేదంటే కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా గుజరాత్‌లో అలాంటిదే ఊహించని ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త.. పిల్లలను చంపేసి, తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దేశంలో కొత్త ట్రెండ్ మొదలైంది. పెద్దలను వ్యతిరేకించలేక పెళ్లి చేసుకుంటున్నారు. ఆ తర్వాత కోరుకున్న ప్రియుడితో రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తున్నారు. ఇంకొందరైతే మ్యారేజ్ తర్వాత ఈ యవ్వారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రేమించిన ప్రియుడ్ని మర్చిపోలేక భర్తలకు విడాకులు ఇస్తున్నవాళ్లు అధికంగా ఉంటున్నారు. కొందరైతే ఏకంగా భర్తలను ఈ లోకం నుంచి పంపేస్తున్నారు.
లేటెస్ట్‌గా గుజరాత్‌లో సూరత్ సిటీలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. అల్పేష్‌భాయ్ కాంతిభాయ్ సోలం-ఫల్గుణి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరికి ఏడేళ్లు, మరొకరికి రెండేళ్లు ఉంటాయి. దిండోలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నాడు కాంతిభాయ్ సోలం. అతడి భార్య ఫల్గుణి జిల్లా పంచాయతీ ఆఫీసులో గుమస్తాగా జాబ్ చేస్తోంది.
అక్కడ ఏం జరిగిందో తెలీదు. భార్యకి వేరే వ్యక్తితో ఎఫైర్ ఉన్నట్లు భర్త గుర్తించాడు. ఆ తర్వాత మనస్తాపానికి గురయ్యాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.అయినా ఆ ఇల్లాలు మనసు ఏ మాత్రం మారలేదు. ఇలాంటివి చూసి తట్టుకోలేకపోయాడు కాంతిభాయ్ సోలం. ఇంట్లో భార్య లేని సమయంలో పిల్లలకు విషం ఇచ్చాడు.
ALSO READ: రాత్రి పబ్‌కి వెళ్లాడు.. ఉదయం నిద్ర లేచేసరికి, పక్కనే యువతి శవం
ఆ తర్వాత తను విషం తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఇది జరిగిన కొద్దిసేపటికి భర్త అల్పేష్‌కు భార్య ఫోన్ చేసింది. భర్త ఫోన్ ఎత్తకపోవడంతో ఆమె ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు లోపల నుంచి లాక్ చేసి ఉండడంతో ఏదో జరిగిందని భావించింది. చివరకు ఇరుగుపొరుగువారు వచ్చి తలుపులు పగలగొట్టారు. అప్పటికే ఇద్దరు పిల్లలు, భర్త ఈ లోకాన్ని విడిచి పెట్టారు.
ఈ ఘటనపై అల్పేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోదరుడి భార్య ఫాల్గుణి.. నరేష్ కుమార్ రాథోడ్‌తో అంతర్గత సంబంధాలు ఉన్నాయని ప్రస్తావించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫాల్గుణిని అరెస్టు చేశారు.
దర్యాప్తులో భాగంగా అల్పేశ్‌భాయ్ మొబైల్ ఫోన్, ఓ సూసైడ్ నోట్, రెండు డైరీలు, అనేక వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు డైరీలలో ఒకటి భార్య కోసం ప్రత్యేకంగా రాశాడు. వివాహేతర సంబంధం కారణంగా దంపతుల మధ్య తరచూ ఘర్షణలు జరిగేవని ప్రస్తావించాడు. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.