Weather Update: తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల క్రితం వరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. ప్రజలు బయటిరాకుండా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురిసాయి. దీంతో వాగులు, వంకలు, రోడ్లు వంటివి అన్ని కూడా పొంగిపోయాయి. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోన్నారు. అయితే వారం రోజుల నుంచి వర్షాలకు బ్రెక్ వచ్చింది. దీంతో ప్రజలు, రైతులు తమ పనులలో చక్కగా నిమగ్నమయ్యారు. కానీ, ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.
ఆగస్టులో భారీ వర్షాలు
హైదరాబాద్‌లో ఆగస్టుల నెలలో సగటు వర్షపాతం 190 మిల్లీమీటర్లు ఉంటుందని వాతావరణ వాఖ తెలిపింది. ఈనెలలో సగం రోజులకుపైగా వర్షం కురుస్తుందనీ, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే అదే సమయంలో ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతోపాటు ఆగస్టు 2నాటికి అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది కూడా బలపడితే ఆగస్టు 5 తరువాత తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈదురుగాలులతో కుండపోత వర్షాలు..
వచ్చే నాలుగైదు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గంటకు 30- 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసి తెలిపింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబ్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: ప్రభుత్వ టీచర్లకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్.. ప్రమోషన్లు ఎప్పుడంటే!
ప్రజలకు బిగ్ అలర్ట్..
రెండు తెలుగు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు, పీడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ చెప్పింది. కావున ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాల కురిసే సమయంలో ప్రజలు ఎవరు బయటకు రాకూడదని.. అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.