BigTV English

Samantha: ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. నటనకు మళ్లీ దూరంగా సమంత..కారణం?

Samantha: ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. నటనకు మళ్లీ దూరంగా సమంత..కారణం?

Samantha: ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది సమంత (Samantha). ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. మహేష్ బాబు (Maheshbabu) తో ‘దూకుడు’ సినిమా చేసి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత బృందావనం, ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది ఇలా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది సమంత. ఒకవైపు తెలుగులో సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు తమిళంలో కూడా అవకాశాలు అందుకొని బిజీగా మారింది. ఇలా వరుస సినిమాలు, యాడ్స్ చేస్తూ బిజీగా మారి.. కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్య (Naga Chaitanya) ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.


హీరోయిన్ గానే కాదు నిర్మాతగా కూడా సత్తా చాటుతున్న సమంత

వివాహం తర్వాత తన భర్తతో కలిసి ‘మజిలీ’ సినిమా చేసి మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.ఇలా వరుసగా కలిసి సినిమాలు చేస్తారు అనుకునే లోపే అనూహ్యంగా విడిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు.నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సమంత.. ‘మయోసైటిస్’ వ్యాధి బారినపడి ఇండస్ట్రీకి దూరమైంది. మధ్యలో శాకుంతలం, యశోద వంటి చిత్రాలు చేసింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో ఒక ఏడాది పాటు పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ‘సిటాడెల్ హనీ బన్నీ’ అనే వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.ఈ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అంతేకాదు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ అనే బ్యానర్ ను స్థాపించి ‘శుభం’ అనే సినిమాను కూడా నిర్మించింది.


నటనకు మళ్లీ దూరం కానున్న సమంత..

మళ్లీ ఇప్పుడు సినిమాలతో బిజీ అవుతుంది అనుకునే లోపే ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి దూరం కాబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు అని కూడా సమాచారం. ఎందుకంటే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కువగా ఈమె బాలీవుడ్ డైరెక్టర్ తో చాలా చనువుగా కొనసాగుతోంది. అతడితో చట్టపట్టలేసుకొని తిరుగుతూ.. వారికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేస్తోంది. దీంతో వీరి మధ్య ఏదో ఉందని అందరూ అనుకున్నారు.దీనికి తోడు రెండు రోజుల క్రితం ఒక రింగ్ ధరించిన ఫోటోని కూడా షేర్ చేయడంతో ఇక ఎంగేజ్మెంట్ అయిపోయింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ అందరూ నిర్ధారణకు వచ్చేస్తున్నారు.

అసలు కారణం ఇదేనా?

ఈ క్రమంలోనే రాజ్ నిడిమోరు తో రెండవ జీవితాన్ని మొదలుపెట్టబోతుందని , అందుకే నటనకు దూరం కాబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్ నిడిమోరు దర్శకత్వంలో ‘ రక్త బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. మరొకవైపు తెలుగులో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను కూడా ప్రకటించింది. ఇవి పూర్తయిన తర్వాత రాజ్ ను పెళ్లి చేసుకొని, నటనకు దూరమవుతుందేమో అంటూ అభిమానులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక నటనకు దూరమై నిర్మాతగా కొనసాగుతుందేమో అని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో రూమర్స్ వస్తున్న వేళ సమంత స్పందిస్తుందేమో చూడాలి.

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×