Kalyani Priyadarshan:ప్రముఖ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మలయాళ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న ‘మార్షల్’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకున్నా.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కమిట్మెంట్ పై చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
కమిట్మెంట్ పై కళ్యాణి ప్రియదర్శన్ కామెంట్స్..
కళ్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. “నేను నా సినిమాల లైన్ అప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాను. నా పాత్రకు న్యాయం చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా సినిమాల కమిట్మెంట్ సమస్యలు చాలా ఎదురవుతున్నాయి. అందుకే ఒకేసారి నాలుగైదు సినిమాలు కాకుండా ఒకే ప్రాజెక్టు.. అందులోనూ మంచి పాత్ర చేయాలి అని డిసైడ్ అయ్యాను. ప్రస్తుతం నేను, కార్తీ సార్ తో కలిసి మార్షల్ సినిమా చేస్తున్నాను. నా దృష్టి అంతా ఈ ఒక్క సినిమా పైనే పెట్టాను. దీనికి దాదాపు నాలుగు నెలల సమయం కూడా కేటాయించాలనుకున్నాను. ముఖ్యంగా ఈ సినిమాల్లోని నా పాత్ర కోసం నేను ఏం చేయగలనో కూడా ఆలోచిస్తున్నాను. ఎవరు చేయలేని విధంగా చాలా గొప్పగా నటించాలనుకుంటున్నాను. సాధారణంగా ప్రతి నటికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. కాబట్టి నేను కూడా ఈ పాత్రను పోషించగలనా? లేదా? అని నమ్మకం కుదిరిన తర్వాతనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.
అందుకే జాగ్రత్త పడుతున్నానంటూ..
సాధారణంగా వరుస లైనప్ వచ్చినప్పుడు మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. కొంతమంది ఏమో అవకాశం వచ్చినప్పుడే పట్టుకోవాలి.. లేదంటే మళ్ళీ అవకాశాలు రావు అంటారు. కానీ ఒకేసారి అన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. అందులో ఏ పాత్రకు కూడా న్యాయం చేయలేకపోతే ఆ సినిమాలన్నీ చేసినా కూడా వృధానే అవుతాయి. అందుకే ఒకేసారి నాలుగు సినిమాలు కాకుండా ఒక్కొక్క చిత్రాన్ని మాత్రమే చేసుకుంటూ నా ఉనికిని చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది కళ్యాణి ప్రియదర్శన్. మొత్తానికైతే సినిమా లైనప్ కమిట్మెంట్ పై ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కళ్యాణి ప్రియదర్శన్ సినిమాలు..
ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిస్సి దంపతులకు 1993 ఏప్రిల్ 5వ తేదీన జన్మించింది. న్యూయార్క్ లోని ఆర్కిటెక్చర్ కోర్స్ పూర్తి చేసిన ఈయన.. 2017లో విడుదలైన ‘హలో’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ్ భాష చిత్రాలలో నటించింది కళ్యాణి ప్రియదర్శన్. ముఖ్యంగా తెలుగులో చిత్రాలహరి, రణరంగం వంటి చిత్రాలలో చేసిన ఈమె.. హీరో సినిమా ద్వారా తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత అటు మలయాళంలో కూడా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇకపోతే హలో సినిమాలో ఉత్తమ నటన కనబరిచినందుకుగానూ సైమా ఉత్తమ తొలిచిత్ర నటిగా అవార్డు లభించింది. ప్రస్తుతం సినిమాల లైనప్ గురించి చెప్పి అందరికీ ఒక ఐడియా ఇచ్చింది అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Big Tv Kissik talks: ప్రాణ స్నేహితుడితో ఢీ డాన్సర్ పండుకి గొడవలు.. లైవ్ లోనే ఎమోషనల్.!