E-Paper
Advertisement

బంగారు పాత్రల్లో భోజనం.. చివరికి శవం కూడా దక్కని దౌర్భాగ్యం! మహానటి వెనుక ఉన్న చీకటి కథ!

బంగారు పాత్రల్లో భోజనం.. చివరికి శవం కూడా దక్కని దౌర్భాగ్యం! మహానటి వెనుక ఉన్న చీకటి కథ!
Advertisement

Kannamba Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గంభీరమైన గొంతు, అద్వితీయమైన నటనతో ఇండస్ట్రీని ఒంటి చేత్తో ఏలిన మహానటి పసుపులేటి కన్నాంబ. ఒకవైపు సిరిసంపదలలో మునిగిపోతూ ఏడువారాల నగల సుందరిగా పేరొందిన కన్నాంబ ఇతరులకు సహాయం చేయడంలోనూ మహాసాద్విగా పేరు పొందింది.అలా ఎంతో వైభవంగా జీవితాన్ని సాగించిన కన్నాంబ చివరి రోజుల్లో అంతే విషాదంగా తన జీవితాన్ని ముగించడం బాధాకరం .కన్నాంబ విషయానికొస్తే 1911 అక్టోబర్ 5న కడప పట్టణంలో వెంకట నరసయ్య, లోకాంబ దంపతులకు జన్మించింది.

కేవలం 11 ఏళ్ళ వయసులోనే

Advertisement

ఇక ఏలూరులోని తన అమ్మమ్మ ఇంట్లో తాతయ్య నాదముని నాయుడు దగ్గర పెరిగిన కన్నాంబకి చిన్నతనం నుంచి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉండేది .ఇక వీధి నాటకాల పట్ల కన్నాంబకి ఆసక్తి గమనించిన తాతయ్య ఆమెకు సంగీతంలో శిక్షణ ఇప్పించారు.అలా కేవలం 11 ఏళ్ళ వయసులోనే నావెల్ నాటక సమాజంలో చేరి బాల పాతలు వేస్తూగుర్తింపు పొందింది కన్నాంబ.ఒకసారి ఏలూరులో జరిగిన ‘సత్య హరిశ్చంద్ర’ నాటకంలో చంద్రమతి పాత్ర వేసిన ఒకతను సరిగ్గా పద్యం పాడలేకపోవడంతో ఒక్కసారిగా ప్రేక్షకుల మధ్య నుంచి వచ్చి లేచిన 16 ఏళ్ల కన్నాంబ ధైర్యంగా స్టేజ్ ఎక్కి ఆ పాత్రను అవలీలగా  పోషించడంతో వన్స్ మోర్ అంటూ ఆడియో చప్పట్లు కొట్టడం  ఆమె జీవితంలో ఒక మర్చిపోలేని సంఘటన .

1935లో పి పుల్లయ్య ‘హరిశ్చంద్ర సినిమాతో వెండితెరకి

Advertisement

అలాంటి ప్రతిభ ఉన్న కన్నాంబని 1935లో పి పుల్లయ్య ‘హరిశ్చంద్ర సినిమాతో వెండితెరకి పరిచయం చేశాడు.ఆ తర్వాత 1936లో వచ్చిన ద్రౌపతి వస్త్రాభరణం ఆమెని మరో మెట్టు ఎక్కించింది.ఆ సినిమాలో ద్రౌపదిగా ఆమె చూపించిన రౌద్రం. పలికించిన నవరసాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి.ఇక సినిమా రంగంలోకి అడుగుపెట్టే ముందే ఎక్కడ తలవంచను. లొంగను అంటూ తల్లిదండ్రులకు మాట ఇచ్చిన కన్నాంబ కి ఆ రోజుల్లోనే క్యాస్టింగ్ కౌచ్ వంటి చేదు అనుభవాలు ఎదురవడం గమనార్హం. అప్పట్లో సౌత్ ఇండస్ట్రీని శాసించిన ఒక ప్రముఖ తమిళ స్టార్ కన్నాంబను లొంగదీసుకోవాలని ప్రయత్నించగా ఆమె అతనికి లొంగకుండా ఇండస్ట్రీలో నిలబడడం విశేషం.

also read:టాలీవుడ్‌లో రూ. 3.5 కోట్ల మోసం.. ‘భాగమతి’ డైరెక్టర్‌పై సైబరాబాద్‌లో కేస్ నమోదు !

ఇక ఆ కక్షతోనే ఆ నటుడు ఆమె కెరీర్ ని  దెబ్బతీయడమే కాకుండా కన్నాంబ భర్త ప్రముఖ దర్శకుడు కడారు నాగభూషణాన్నికూడా టార్గెట్ చేస్తూ ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా పగబడ్డాడని ఆమె మనవడు పసుపులేటి దేవి చౌదరి ఆ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .బందరు ‘బాలమిత్ర నాటక సమాజం’లో పరిచయమైన కడారు నాగభూషణంని  పెళ్లి చేసుకున్న తర్వాత 1941లో శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీని స్థాపించింది కన్నాంబ.అలా ఆ బ్యానర్ పై వారు నిర్మించిన మొదటి సినిమా ‘తల్లిప్రేమ’ (1941) సూపర్ హిట్ అయినా ఆ తర్వాత ‘సతీ సుమతి’ (1942) సినిమా కన్నాంబని ఆర్థిక కష్టాల్లోకి నెట్టాయి.

ఆమె దగ్గర సంపద ఎంతలా ఉండేదంటే

అయినా పట్టు విడవకుండా ‘మాయాలోకం’ (1945), ‘పల్నాటి యుద్ధం’ (1947), ‘సౌదామిని’ (1951), ‘పేదరైతు’ (1952), ‘అనార్కలి’ (1955), ‘తోడికోడళ్లు’ (1957) వంటి వందకు పైగా సినిమాల్లో నటిస్తూ టాప్ స్టార్ గా ఒక వెలుగు వెలిగింది కన్నాంబ.అయితే అప్పట్లో ఆమె దగ్గర సంపద ఎంతలా ఉండేదంటే ఇంట్లో బంగారు పాత్రలు ఉండేవని, మార్కెట్లో కన్నాంబ లోలాకులు పేరిట నగలు, ఆభరణాలు అమ్మేవారని కథలు కథలుగా చెప్పుకునేవారు.అలా ఒకటో తారీకు రాకముందే తమ దగ్గర పని చేసే వారికి మొదటి తారీఖే జీతాలు ఇవ్వడం, ఆఫీస్ కాంపౌండ్ లో అడుగుపెట్టిన ఎవరికైనా భోజనం పెట్టడం కన్నాంబకి అలవాటు.

 నేటికీ ఇండస్ట్రీకి ఒక మాయని మచ్చ

అయితే పగబట్టిన ఆ నటుడుతోనే మళ్లీ సినిమాలు నిర్మించాల్సిన రావడం, పొలిటికల్ ఎంట్రీలు సినిమా ఒప్పందాల్లో జరిగిన మోసాలు అలాగే దానధర్మాలు కన్నాంబ దంపతులని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేశాయి .ఇక భారీ బడ్జెట్ తో వారు నిర్మించిన దక్షయజ్ఞం సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో వారిని ఆర్ధిక కష్టాలు మరింత చుట్టుముట్టాయి.  మహానటి సావిత్రి, ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీ గణేషన్ వంటి దిగజాలకు తల్లిగా సీరియస్ రోల్స్ లో మెప్పించిన కన్నాంబ, లవకుశలో కౌసల్యగా, ఆత్మబలంలో చివరిసారిగా నటించి అదే ఏడాది మే 7న తన 52వ ఏట కన్నుమూసింది.ఇక ఆమె అంత్యక్రియలకు ఎన్టీఆర్ ఎన్టఆర్ వంటి ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్స్ వచ్చి నివాళులు అర్పించారు.అయితే ఆమె చనిపోయిన తర్వాత జరిగిన ఒక ఘోరం నేటికీ ఇండస్ట్రీకి ఒక మాయని మచ్చ అని చెప్పాలి.

ఇప్పటి వరకు కూడా దొరకకపోవడం బాధాకరం

కన్నాంబ మృతదేహాన్ని వారి కులాచారం ప్రకారం విలువైన ఆభరణాలతోనే సమాధి చేయగా తర్వాతి రోజు చూసేసరికి సమాధి తవ్వి శవం మాయం చేశారట కొందరు.అయితే కేవలం నగల కోసమే దొంగలు ఆ పనిచేశారని కొందరు అంటే కాదు కాదు చనిపోయాక కూడా కక్ష సాధించడానికి ఆ ప్రముఖ నటుడే మనుషులను పంపి శవాన్ని మాయం చేయించి ఎక్కడో  పారేయించాడని ఆమె మనవడు సంచల ఆరోపణలు చేశాడు.ఇక పోలీసులు కేసు దర్యాప్తు చేసినా  ఆమె మృతదేహం ఇప్పటికీ ఏమైందో తెలియకపోవడం బాధాకరం.అయితే ఆమె చనిపోయిన తర్వాత భర్త కడారునాగభూషణం పరిస్థితి మరి దయనీయంగా మారింది .పూర్తిగా ఆస్తిని కోల్పోయి చెన్నైలోని ఒక చిన్న హోటల్ గదిలో కేవలం ఒక ట్రంకు పెట్టె , కుర్చీ, గోడకు ఉన్న కన్నాంబ ఫోటో మధ్య కాలం గడుపుతూ  1976లో చనిపోయారు ఏది ఏమైనా ఇండస్ట్రీని ఏలిన ఒక మహానటి మృతదేహం ఇప్పటి వరకు కూడా దొరకకపోవడం బాధాకరం !

also read:సోగ్గాడు రియల్ లైఫ్ సీక్రెట్స్:భార్య శాంతకుమారి మరణంతో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విశేషాలు!

Related News

ప్రభాస్ ‘ఫౌజీ’ థియేట్రికల్ డీల్స్ క్లోజ్…దక్కించుకుంది ఎవరో తెలుసా ?

నాగార్జున తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా?

ఎరుపెక్కిన బుగ్గలు.. అతడినే పెళ్లి చేసుకుంటానంటున్న భాగ్యశ్రీ.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో రూ. 3.5 కోట్ల మోసం.. ‘భాగమతి’ డైరెక్టర్‌పై సైబరాబాద్‌లో కేస్ నమోదు !

మాజీ అత్తింటిపై వీడని మమకారం..కష్టాల్లో ఉన్న మరిదికి సమంత తోడైతే?

‘బిజినెస్ మ్యాన్’ రొమాన్స్ మర్చిపోయావా చందమామ?.. కాజల్ కబుర్లపై నెటిజన్ల సెటైర్లు!

సైన్స్ ఫిక్షన్‌తో సుమ కొడుకు కొత్త ప్రయోగం.. బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా?

Big Stories

Advertisement
×