Nagarjuna:లగ్జరీగా జీవించడం అంటే ఖరీదైన కార్లలో తిరగడం.. పెద్ద పెద్ద భవనాలలో నివసించడం.. అందరూ ఆశ్చర్యపోయే వస్తువులను ఉపయోగించడం కాదు.. మన దినచర్యలో పాటించే క్రమశిక్షణ దీనికి ప్రధాన కారణం అని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు నిరూపిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధాప్య వయసులో కూడా నిత్య యవ్వనంగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అలాంటి వారిలో కింగ్ నాగార్జున కూడా ఒకరు.. వేలకోట్ల ఆస్తులతో కాదు తన ఫిట్నెస్ తో.. నిత్య ఆరోగ్యంతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.. ముఖ్యంగా ఖరీదైన వెల్నెస్, ఉత్పత్తులు ఒకరి జీవన శైలిలో భాగం కావచ్చు కానీ.. నిజమైన ఫిట్నెస్ ఎల్లప్పుడూ రోజువారీ అలవాట్లు, సరైన పోషకాహారం, మంచి నిద్ర , శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నుండే వస్తుంది అని నిరూపించారు.
ఇక అందులో భాగంగానే తాజాగా ఆయన తాగే ఒక లీటర్ నీళ్ల ధర , దాని ప్రత్యేకతలు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నాగార్జున ఒకవైపు తన సినిమా షూటింగ్లలో బిజీగా ఉంటూనే.. మరొకవైపు పలువురు హీరోల చిత్రాల ఈవెంట్లకు స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి సందడి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆ ఈవెంట్లలో ఆయన తాగే వాటర్ బాటిల్ అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే మరొకసారి ఆయన తాగే వాటర్ బాటిల్ అందరినీ ఆకర్షించింది. ఇక దీంతో నాగార్జున ప్రత్యేకంగా తీసుకుంటున్న ఆ వాటర్ బాటిల్ ప్రత్యేకత ఏంటి? దాని ఖరీదు ఎంత? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. నాగార్జున తాగే నీరు సాధారణమైన నీరు కాదు.. ఇది ప్రీమియం ఫ్లేవర్డ్ టానిక్ వాటర్. లీటర్ బాటిల్ ఖరీదు అక్షరాల రూ. 500.. ఇకపోతే ఇది ఇంపోర్టెడ్. ఇకపోతే యవ్వనంగా కనిపించడానికి, ఫిట్ నెస్ ను కాపాడుకోవడానికి తీసుకునే ఆహారంతో పాటు రోజుకి ఐదు లీటర్లకు పైగా నీరు తాగడం, ఆయన దినచర్యలో భాగం. పైగా ఈ ప్రత్యేకమైన వాటర్ అదనపు పోషకాలు, హైడ్రేషన్ అందించడానికి సహాయపడుతుంది. మొత్తానికి అయితే నాగార్జున తాగుతున్న ఈ లీటర్ వాటర్ బాటిల్ అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా 66 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఇలా నిత్య యవ్వనంగా ఉండడానికి ఈ వాటర్ ఎంతగా ఉపయోగపడుతుందో అర్థం అవుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
also read:ఎరుపెక్కిన బుగ్గలు.. అతడినే పెళ్లి చేసుకుంటానంటున్న భాగ్యశ్రీ.. వీడియో వైరల్!
నాగార్జున ఫిట్నెస్ గా కనిపించడానికి 12:12 పద్ధతిని పాటిస్తారు. అంటే రోజులో 12 గంటలు మాత్రమే ఆహారం తీసుకొని.. మిగిలిన 12 గంటల పాటు ఆయన ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే వ్యాయామం చేయడానికి ముందు గోరువెచ్చని నీరు, కాఫీతో పాటు కిమ్చి లేదా పులియపెట్టిన క్యాబేజీ వంటి సహజ ప్రోబయోటిక్స్ ని తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తన ఆహారంలో తెల్లటి అన్నం తినకుండా దానికి బదులుగా బ్రౌన్ రైస్, పెరుగు, ఆకుకూరలు, చికెన్ లేదా చేపలను ఒక భాగంగా చేసుకుంటారట. అలాగే రాత్రి 7 గంటల లోపే భోజనం చేసేస్తారు. దీనివల్ల శరీరం ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోవడమే కాకుండా జీవక్రియ మెరుగుపడుతుంది. ఇక ప్రతి ఆదివారం తనకు ఇష్టమైన బిర్యానీ , చాక్లెట్ల తో పాటు ఇతర ఆహారాలను ఎలాంటి భయం లేకుండా తింటారట. డైట్ తో పాటు రోజు క్రమం తప్పకుండా జిమ్ లో వర్కౌట్స్ చేయడం , ఆయన ఫిట్నెస్ రహస్యమని ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.