Kajal Aggarwal:మారిపోయింది ..కాజల్ మారిపోయింది.. అవును ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ ఒలకపోసి యూత్ గుండెల్లో చందమామగా నిలిచిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు పడికట్టు సూత్రాలకి బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయింది.గ్లామర్ డాల్ గా కెరీర్ మొదలెట్టిన ఈ సీనియర్ బ్యూటీ ఇప్పుడు బోల్డ్ సీన్స్ , బికినీలపై చేసిన కామెంట్ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.ఎంత పెద్ద సినిమా అయినా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తాను గీసుకున్న లక్ష్మణ రేఖను అసలు దాటినని, ఇక వెండితెరపై బికినీ వేయడం, ఇంటిమేట్ సీన్స్ లలో నటించడం తన మనస్సాక్షికి అస్సలు నచ్చదు అంటూ కుండలు బద్దలు కొట్టేసింది ఈ చందమామ.
బహుశా చందమామ మర్చిపోయిందేమో
ఇక ఈ కామెంట్స్ చేయగానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మాన్ సినిమాని రివైండ్ చేస్తున్నారు నెటిజన్లు.అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఈ అమ్మడు చేసిన రొమాంటిక్ సీన్స్ లిప్ లాక్స్ ,కారులో సాగే ఇంటెన్స్ ఎపిసోడ్ సీన్స్ బహుశా చందమామ మర్చిపోయిందేమో అంటూ కామెంట్స్ వదులుతున్నారు.కెరీర్ మొదలైనప్పటి నుండి హద్దులు దాటలేదని కాజల్ కరప్ చేస్తుంటే అప్పటి వరకు ఉలకపోసిన గ్లామర్ అంత ట్రెడిషనల్ ఏనా అంటూ సెటైర్లు వేస్తున్నారు.కెరీర్ చివరికి వచ్చే సరికి హీరోయిన్లు ఇలా ప్లేటు ఫిరాయించడం ,సరిపోని కబుర్లు చెప్పడం ఇండస్ట్రీకి కొత్తేమీ కాదని, ఏదేమైనా పెళ్లి అయిపోగానే వేదాంతం వలకబోయడమే ఏమీ బాగోలేదంటూ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తున్నారు,
కబుర్ల వెనక అసలు ప్లాన్ వేరే
అయితే కాజల్ చెబుతున్న కబుర్ల వెనక అసలు ప్లాన్ వేరే ఉందని గట్టిగా వినిపిస్తుంది.ముఖ్యంగా ఆమె లీడ్ రోల్ లో నటించిన ‘ది ఇండియా స్టోరీ’ అనే సినిమా ఈ నెల 24న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయింది ఇప్పటివరకు కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ డాల్ గా అందాలు ఆరబోసిన ఈ అమ్మడు ఈ సినిమాలో అడ్వకేట్ అర్చన అనే పవర్ ఫుల్ కనిపించబోతుంది.వ్యవసాయంలో రసాయన పురుగుమందుల వాడకం, మార్కెట్లో ఆహార కల్తీతో ఆరోగ్యాలు ఎలా చెడిపోతున్నాయి అనే సీరియస్ సబ్జెక్టుపై ఈ కోర్ట్ రూమ్ డ్రామా నడవనుంది,ఇందులో శ్రేయాస్ తల్పాడే కూడా కనిపిస్తుంది ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ కేవలం నటన గురించే కాకుండా దేశం బాగుపడాలి, ప్రజలు బాధ్యతగా ఉండాలి, ఇంట్లో నీటిని పొదుపు చేయాలి, కరెంటు సరిగ్గా వాడాలంటూ పొలిటిషన్ రేంజ్ లో స్పీచ్ లు ఇచ్చేస్తుంది.
జనాలు ఎంతవరకు ఆదరిస్తారో !
సినిమా ఎలాగూ లేడీ ఓరియంటెండ్ కాబట్టి ఇలాంటి హోమ్లి అండ్ సోషల్ స్టేట్మెంట్లు ఇస్తే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వస్తానని వస్తారని ఈ చందమామ ప్లాన్ చేసిందేమో కాబోలు.అయితే గతంలో ఈ అమ్మడు చేసిన ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి అన్నది మర్చిపోయిందేమో. చూడాలి మరి ఇప్పటికైనా ఈ లాయర్ అవతారాన్ని ఎత్తిన కాజల్ ని జనాలు ఎంతవరకు ఆదరిస్తారో !