E-Paper
Advertisement

మాజీ అత్తింటిపై వీడని మమకారం..కష్టాల్లో ఉన్న మరిదికి సమంత తోడైతే?

మాజీ అత్తింటిపై వీడని మమకారం..కష్టాల్లో ఉన్న మరిదికి సమంత తోడైతే?
Advertisement

Samantha:ప్రముఖ పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత (Samantha ), నాగచైతన్య (Naga Chaitanya)నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తూ.. ఆ కుటుంబంపై ఎప్పటికప్పుడు తన మమకారాన్ని చాటుకుంటోంది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ (Akhil)కి ఇప్పుడు అండగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది సమంత. అసలు విషయంలోకి వెళ్తే.. దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత ‘లెనిన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పైగా వివాహం అనంతరం అఖిల్ నటించిన తొలి చిత్రం కూడా ఇదే. భారీ అంచనాల మధ్య రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అఖిల్ కి స్పెషల్ విషెస్ తెలియజేసిన సమంత..

ఈ సినిమాలో అఖిల్ తన అద్భుతమైన నటనా ప్రదర్శనతో అదరగొట్టేశారు. పైగా అఖిల్ తన కెరీర్ లోనే ఈ సినిమాకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ సినిమాకి అండగా సమంత స్పెషల్ విషెస్ తెలియజేస్తూ పంచుకున్న పోస్ట్ సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. అక్కినేని కుటుంబానికి మాజీ కోడలిగా పేరు దక్కించుకున్న సమంత అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమాకి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ మేరకు నాగార్జున వాయిస్ ఓవర్ తో రిలీజ్ అయిన లెనిన్ మూవీ ట్రైలర్ ను పోస్ట్ చేస్తూ..” అఖిల్ అక్కినేనికి అలాగే లెనిన్ చిత్రానికి నా శుభాకాంక్షలు.. ఈ సినిమాకి అప్పుడే బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చేసాయి”అంటూ తన అభిప్రాయాలను పంచుకుంది.

Advertisement

also read:Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ.. కష్టం అఖిల్‌ది.. కన్ఫ్యూజన్ డైరెక్టర్‌ది !

మ్యూచువల్ రెస్పెక్ట్ ఎప్పటికీ మారదు..

ప్రస్తుతం సమంత ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అక్కినేని అభిమానులు కూడా సమంత పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. అత్తింటికి దూరమైనప్పటికీ.. మాజీ అత్తింటిపై మమకారం ఏమాత్రం పోలేదు. వ్యక్తిగత జీవితాలు వేరైనా.. వారి మధ్య ఉన్న బాండింగ్ , మ్యూచువల్ రెస్పెక్ట్ ఎప్పటికీ మారవు” అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత అండగా నిలవడం ఈ సినిమాకు మరింత ప్లస్గా మారింది అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

మా ఇంటి బంగారం పై అఖిల్ కామెంట్..

ఇదిలా ఉండగా మరొకవైపు ఇటీవల సమంత కూడా దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సమంత యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది. పైగా లెనిన్ ప్రమోషన్స్ లో అఖిల్ మా ఇంటి బంగారం అలాగే సమంత పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన కామెంట్లు కూడా వైరల్ గా నిలిచాయి. ఏది ఏమైనా పరస్పర ప్రోత్సాహం అందరిని ఆకట్టుకుంటోంది.

లెనిన్ మూవీ విశేషాలు..

లెనిన్ సినిమా విషయానికి వస్తే.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున , సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.

Related News

ఎరుపెక్కిన బుగ్గలు.. అతడినే పెళ్లి చేసుకుంటానంటున్న భాగ్యశ్రీ.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో రూ. 3.5 కోట్ల మోసం.. ‘భాగమతి’ డైరెక్టర్‌పై సైబరాబాద్‌లో కేస్ నమోదు !

‘బిజినెస్ మ్యాన్’ రొమాన్స్ మర్చిపోయావా చందమామ?.. కాజల్ కబుర్లపై నెటిజన్ల సెటైర్లు!

సైన్స్ ఫిక్షన్‌తో సుమ కొడుకు కొత్త ప్రయోగం.. బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందా?

నందమూరి మోక్షజ్ఞ విత్ సందీప్ వంగ …ఇది అయ్యేదేనా ?

సోగ్గాడు రియల్ లైఫ్ సీక్రెట్స్:భార్య శాంతకుమారి మరణంతో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విశేషాలు!

‘జన నాయగన్ ‘ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్లు మార్చుకున్న స్టార్ హీరోలు..!

Big Stories

Advertisement
×