Kannappa Collection 2nd Day :మహాభారతం ఎపిసోడ్ సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar singh)దర్శకత్వంలో మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా నటించిన చిత్రం కన్నప్ప (Kannappa). మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan)హీరోయిన్ గా నటించినది. ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohan Lal), అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal), మోహన్ బాబు(Mohan Babu), బ్రహ్మానందం(Brahmanandam )తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ తెరకెక్కిన చిత్రం ఇది. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అంటూ మేకర్స్ పోస్టర్స్ వేసుకున్నారు. కానీ ఇప్పుడు రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్లు చూస్తే మాత్రం ఈ కలెక్షన్స్ తోనే ఇండస్ట్రీ హిట్ అయిపోతుందా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
కన్నప్ప బడ్జెట్ లెక్కలు..
కన్నప్ప విషయానికి వస్తే.. న్యూజిలాండ్ లోని 7వేల ఎకరాల రిసార్ట్లో ఈ సినిమా చిత్రీకరణ చేశారు. టెక్నికల్ వాల్యూస్ ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించారు. అటు నటీనటుల రెమ్యూనరేషన్, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సుమారుగా రూ200 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ పండితులు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 5250 థియేటర్లలో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
కన్నప్ప మొదటి రోజు కలెక్షన్స్..
జూన్ 27వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ.13 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినట్లు సమాచారం .ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.8.25 కోట్లు, హిందీలో రూ.65 లక్షలు, తమిళంలో రూ.15 లక్షలు, మలయాళం లో రూ.20 లక్షలు, కన్నడలో రూ.10 లక్షలు వచ్చాయి. తెలుగులో మాత్రమే ఈ సినిమా భారీగా ఆదరణను చూరగొంది. కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్లు ఈ సినిమాకు ఏమాత్రం ప్లస్ కాలేదని హిందీ కలెక్షన్లు చూస్తే అర్థమవుతుంది. అటు మోహన్ లాల్, శరత్ కుమార్లు కూడా తమ తమ రాష్ట్రాలలో ఈ సినిమాను మోయలేకపోయారని విశ్లేషకులు కూడా స్పష్టం చేస్తున్నారు. అలా తొలి రోజు రూ.9.35 కోట్ల నెట్ , రూ.11 కోట్ల గ్రాస్ వసూలు మాత్రమే రాబట్టింది. ఇక ఇతర దేశాల ద్వారా రూ.2 కోట్లు వచ్చినట్లు సమాచారం.
కన్నప్ప రెండవ రోజు కలెక్షన్స్..
ఇక రెండవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఇక రెండవ రోజు రూ.22 నుండి రూ.25 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై ఇంకా చిత్ర బృందం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మొత్తానికైతే రెండు రోజుల్లో ఈమేరా కలెక్షన్లు రాబట్టింది అంటే ఇక ఈ కలెక్షన్లతోనే ఇండస్ట్రీ హిట్ సాధిస్తుందా అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వీకెండ్స్ కావడంతో ఈరోజు, రేపు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అభిమానులు ఆశపడుతున్నారు. మరి ఈ రెండు రోజుల కలెక్షన్స్ అయినా సినిమాను ముందుకు తీసుకెళ్తాయేమో చూడాలి.
ALSO READ:Komali Prasad: డెంటిస్ట్ గా మారిన హిట్ బ్యూటీ.. ఇండస్ట్రీకి దూరం కానుందా?