Komali Prasad: ప్రముఖ హీరోయిన్ కోమలీ ప్రసాద్ (Komali Prasad) హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన నాని (Nani )’హిట్ 3′ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. అంతేకాదు అడివి శేషు (Adivi shesh)హీరోగా వచ్చిన హిట్ 2 లో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఇదిలా ఉండగా తాజాగా కోమలి ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు సమాచారం అంతేకాదు ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. మరి కోమలి ఏం ప్రాక్టీస్ మొదలుపెట్టింది? అసలు విషయం ఏమిటో? ఇప్పుడు చూద్దాం.
డెంటిస్ట్ గా మారిన హిట్ బ్యూటీ..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ బ్యూటీ కోమలి ప్రసాద్ డెంటిస్ట్ గా మారినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. వైట్ కోట్ ధరించి డెంటిస్ట్ గా మారినట్టు ఫోటోలు షేర్ చేస్తూ..” అందరూ స్వచ్ఛమైన స్మైల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి.. త్వరలోనే డాక్టర్ కోమలి ప్రసాద్ రాబోతోంది” అంటూ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తానికైతే డెంటిస్ట్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు కోమలి ప్రసాద్ స్పష్టం చేసింది. ఇన్ని రోజులు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన నటనతో అబ్బురపరిచిన ఈమె ఇప్పుడు డెంటిస్ట్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది. మరి భవిష్యత్తులో సినిమాలు చేస్తుందా? లేక డాక్టర్ గానే సెటిల్ అవుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.
సినిమాల్లోకి రావడం నాన్నకు ఇష్టం లేదు -కోమలి ప్రసాద్
కోమలి ప్రసాద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన నాన్నకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..” నేను ఒక డెంటిస్ట్ ని డాక్టర్ చదువు పూర్తి చేసి డెంటిస్ట్ గా కూడా పనిచేశాను. సినిమాల్లోకి వస్తానంటే మా నాన్న ఒప్పుకోలేదు. డాక్టర్ సర్టిఫికెట్ ఉన్నాకే ఏదైనా చేయి అని చెప్పారు. ఇక చేతిలో డిగ్రీ ఉంటే సేఫ్ గా ఉంటుందని నాన్న చెప్పడం వల్లే.. ఇండస్ట్రీలోకి లేటుగా వచ్చాను. న్యూయార్క్ వెళ్లి మాస్టర్ చేద్దామనుకున్న సమయంలో నేను సీతాదేవి అనే సినిమాలో అవకాశం వచ్చింది. అలా మాస్టర్స్ అప్లికేషన్ కూడా చింపేసి సినిమాల్లోకి వచ్చాను” అంటూ తెలిపింది కోమలి.
కోమలి ప్రసాద్ సినిమాలు..
కోమలి ప్రసాద్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో నెపోలియన్, హిట్, టచ్ మీ నాట్, లూజర్ వంటి చిత్రాలలో నటించింది. ఇక ఈమె హీరోయిన్ డెంటిస్ట్ మాత్రమే కాదు క్లాసికల్ డాన్సర్ కూడా. ఇంకా ఇప్పుడు డెంటిస్ట్ గా మారి ప్రాక్టీస్ మొదలు పెట్టేసింది. ఏది ఏమైనా ఈ బ్యూటీలో ఇన్ని టాలెంట్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Sarkaar 5 Promo: సినిమా తీస్తానంటున్న బబ్లూ.. రాజు దెబ్బకు కన్నీళ్లు!