Annadata Sukhibhava Scheme: రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ఒకేసారి రెండు పథకాలు అమలు చేయాలని నిర్ణయించాయి.కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం, ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు ఒకేసారి విడుదల కానున్నాయి. ఈ రెండు పథకాలు కలిపి రైతుల ఖాతాలో ఒకేసారి 20 వేలు రూపాయలు జమ కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరువేలు, రాష్ట్రప్రభుత్వం 14 వేలు కలిపి ఆ రైతుల ఖాతాలో జమ చేయనుంది. 20 వేలను మూడు విడతలుగా జమ చేయనుంది. రైతుల భూములకు సంబంధించి ఇప్పటివరకు 98 శాతం ఈ కేవైసీ పూర్తి అయ్యింది. కేవలం రెండు శాతం మాత్రమే మిలిగి వుంది. సొంత భూమి కలిగిన డి-పట్టాదారులు అర్హులు. అలాగే అసైన్డ్, ఇనాం భూములు కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులని స్వయంగా ప్రభుత్వం ప్రకటించింది.
పీఎం కిసాన్ జులైలో నిధులు విడుదల చేస్తుందని భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం జులైలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తోంది. అర్హులైన లబ్దిదారులైన అకౌంట్లలో ఏపీ ప్రభుత్వం తరపున రూ.5,000, పీఎం కిసాన్ కింద రూ.2,000 కలిసి రైతులకు రూ.7,000 అందనున్నాయి.
అన్నదాత సుఖీభవ ప్రతి రైతు కచ్చితంగా పొందాలన్నది ప్రభుత్వం ఆలోచన. వారి కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ని రెడీ చేసింది. దానికి లింక్ కూడా వచ్చింది. https://annadathasukhibhava.ap.gov.in ఓసారి ఈ సైట్‌కి వెళ్లి పరిశీలన చేయవచ్చు. వచ్చేవారంలో రెడీ కానుంది. లబ్దిదారులు తమ పేర్లను అందులో చెక్ చేసుకోవచ్చు. డబ్బు రాకపోతే, ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు. ఆధార్ నంబర్ ద్వారా తెలుసుకునే ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
ALSO READ: తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్
అన్నదాత సుఖీభవ పథకం గురించి మొబైల్‌లో తెలుసుకోవచ్చు. ప్రభుత్వం యాప్‌ని తీసుకొచ్చింది. వెబ్‌సైట్‌లో పైనున్న మొబైల్ యాప్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్‌లో కూడా చూసుకోవచ్చు.
ఏపీలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల కింద మొత్తం 47.77 లక్షల రైతులను అర్హులుగా గుర్తించింది. గ్రామ లేదా వార్డు సచివాలయాల సర్వే ద్వారా 98 శాతం E-KYC పూర్తి చేసింది. మరో వారంలో వారికి ఈ-కేవైసీ పూర్తి కానుంది. సొంతభూమి ఉన్న డి పట్టాదారులు, ఎసైన్డ్, ఈనాం భూములు కలిగినవారు ఈ పథకానికి అర్హులు.
భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల కౌలు రైతులు తమ పేరును ఈ పంటలో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత వారికి గుర్తింపు కార్డులు ఇవ్వనుంది. అర్హతలను పరిశీలించిన తర్వాత అన్నదాత సుఖీభవ ఇవ్వనుంది.
ఏపీ ప్రభుత్వం జులై, అక్టోబర్‌లో అన్నదాత సుఖీభవ పథకం నిధులు ఇస్తామని తెలిపింది. పీఎం కిసాన్ మనీ ఎప్పుడు రిలీజయితే అప్పుడు అన్నదాత సుఖీభవ నిధులు రిలీజ్ కానున్నాయి. ఆ విధంగా ఏపీ ప్రభుత్వం జులైలో రూ.5000, అక్టోబర్‌లో రూ.5000, జనవరి- ఫిబ్రవరిలో రూ.4000 చొప్పున నిధులు విడుదల చేసే ఛాన్స్ ఉంది.