BigTV English

Kantara Chapter 1: ఆస్కార్ బరిలోకి కాంతార 2..ఆ నమ్మకం వర్కౌట్ అవుతుందా?

Kantara Chapter 1: ఆస్కార్ బరిలోకి కాంతార 2..ఆ నమ్మకం వర్కౌట్ అవుతుందా?
Advertisement

Kantara Chapter 1: సినిమాల్లో అత్యున్నత పురస్కారం అంటే ఆస్కార్ అవార్డు.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటు వంటి చలనచిత్ర అవార్డు. ఈ అవార్డు రావడం ఒక అదృష్టం. సినిమా ఇండస్ట్రీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు, హీరో హీరోయిన్లు, రచయితలు, సాంకేతిక నిపుణులకు ఈ ఆస్కార్ అవార్డ్స్ ఇస్తారు. అయితే అలాంటి ఆస్కార్ అవార్డు మన తెలుగు ఇండస్ట్రీ నుండి ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటునాటు పాటకు మ్యూజిక్ అలాగే లిరిక్స్ అందించినటువంటి ఎం.ఎం. కీరవాణి,చంద్రబోస్ లకి వచ్చింది. ఆస్కార్ బరిలో అప్పుడప్పుడు కొన్ని సౌత్ సినిమాలు కూడా నిలిచాయి. కానీ ఇప్పటివరకైతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎం.ఎం.కీరవాణి, చంద్రబోస్ లకు తప్పితే మిగతా వారికి ఆస్కార్ అవార్డు రాలేదు. ఇదిలా ఉంటే తాజాగా 700 కోట్ల కలెక్షన్లకు పైగా సాధించిన సెన్సేషనల్ మూవీ కాంతార చాప్టర్ 1 ఆస్కార్ బరిలో నిలవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..


ఆస్కార్ బరిలో దిగనున్న కాంతార చాప్టర్ 1..

విషయంలోకి వెళ్తే.. మైథాలాజికల్ సినిమాగా తెరకెక్కిన కాంతర చాప్టర్ 1 మూవీ కాంతార మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాకి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు. అలా హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మైథాలాజికల్ మూవీని ఆస్కార్ అవార్డ్స్ బరిలోకి తీసుకెళ్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే.. హోంబలే సంస్థ వాళ్లు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంతార చాప్టర్ 1 సినిమాని ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ చేయాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈ సినిమా తెరకెక్కించే ముందే సినిమాని ఆస్కార్ బరిలో ఉంచుతారనే వార్తలు వినిపించాయి. అందుకే సినిమా తెరకెక్కించే ముందే ఎక్కడ కూడా తేడా కొట్టకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా సినిమాని కంప్లీట్ చేశారు. సినిమా రిలీజ్ కి ముందు వచ్చిన వార్తలకు తగ్గట్టు ఈ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ కి పంపుతున్నట్టు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి..

నమ్మకం నిజమవ్వాలని అభిమానుల ఆకాంక్ష..

ఈ సినిమా అంతర్జాతీయ లెవెల్లో సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో కచ్చితంగా ఈ సినిమాకి అవార్డు వస్తుందని కొంతమంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ఆధ్యాత్మిక భావన,జానపద శైలి, ప్రేక్షకులను అలరించిన తీరుతో ఆస్కార్ అవార్డు గ్యారెంటీ అని నమ్ముతున్నారు. అందుకోసమే హోంబలే సంస్థ వాళ్లు ఈ సినిమాని ఆస్కార్ కి నామినేట్ చేయాలని చూస్తున్నారట.. అయితే ఇప్పటివరకైతే హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. మరి ఈ సినిమాని ఆస్కార్ కి నామినేట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.


కాంతార చాప్టర్ వన్ విశేషాలు..

కాంతార చాప్టర్ 1 మూవీ విషయానికి వస్తే.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. అలాగే జయరాం, గుల్షన్ దేవయ్యలు కీ రోల్స్ పోషించారు. ఇందులో రుక్మిణి వసంత్ గ్లామర్ పాత్రలో అదరగొట్టింది. రిషబ్ శెట్టి యాక్టింగ్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే గూస్ బంప్స్ తెప్పించే బ్యాగ్రౌండ్, మ్యూజిక్ సినిమాకి హైలెట్గా నిలిచింది.అలా ఇప్పటి వరకు 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా థియేటర్లలో ఇంకా హౌస్ ఫుల్ బోర్డులతో రన్ అవుతోంది. ఇక ఈ సినిమా హవా ఇలాగే కొనసాగితే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ALSO READ: Saamrajyam Promo:‘సామ్రాజ్యం’ ప్రోమో.. నా పాత్రకు ఎన్టీఆర్ కరెక్ట్ అంటూ ఇరగదీసిన శింబు, మైండ్ బ్లోయింగ్ సీన్ రిలీజ్

Related News

Lasya -Roja: యాంకర్ లాస్య గృహప్రవేశం.. సందడి చేసిన రోజా..ఎంతో ప్రత్యేకం అంటూ!

Rekha Boj: కిడ్నీలు అమ్మి అయినా సినిమా చేస్తా..కానీ ఆ పని చెయ్యను: రేఖా భోజ్

People Media Factory: ఇంత చేసినా.. వీళ్లకు సొంత హిట్టు లేదు తెలుసా… హోప్స్ అన్నీ దానిపైనే

Jatadhara Trailer: మంత్ర బంధనాలతో ‘జటాధర’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

K-Ramp : కిరణ్ అబ్బవరం సినిమాకు గ్రౌండ్ క్లియర్ , సినిమా విన్ అయిపోయినట్లేనా?

Dil Raju : వివి వినాయక్ కు వచ్చిన పరిస్థితి దేవిశ్రీకి వస్తుందా? దిల్ రాజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా?

Varalakshi -Sarath Kumar: కూతురి విషయంలో గర్వపడుతున్న హీరో..ఆ మాట చాలంటూ!

Big Stories

×