E-Paper
Advertisement

K-Ramp : కిరణ్ అబ్బవరం సినిమాకు గ్రౌండ్ క్లియర్ , సినిమా విన్ అయిపోయినట్లేనా?

K-Ramp : కిరణ్ అబ్బవరం సినిమాకు గ్రౌండ్ క్లియర్ , సినిమా విన్ అయిపోయినట్లేనా?
Advertisement

K-Ramp : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్ వస్తే చాలు చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతుంటాయి. అలానే దీపావళి కానుకగా ఏకంగా బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు సినిమాలు పోటీకి దిగాయి. నాలుగు సినిమాలు రిలీజ్ కి ముందు ట్రైలర్లు మాత్రం విపరీతంగా ఆకట్టుకున్నాయి. మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, K-Ramp సినిమాలను దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్లు ముందుగానే అనౌన్స్ చేశారు.

వీటిలో మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్ సినిమాలు ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద విడుదల అయిపోయాయి. అయితే ఈ మూడు సినిమాల్లో డ్యూడ్ సినిమాకు, తెలుసు కదా సినిమాకు కొద్దిపాటి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. కానీ యునానిమస్ గా హిట్ టాక్ అయితే రాలేదు. బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధంగా ఉన్న మూడు సినిమాలు ఆల్రెడీ విడుదల అయిపోయాయి. ఇంక కిరణ్ అబ్బవరం నటిస్తున్న K-Ramp సినిమా విడుదల కావాలి.

గ్రౌండ్ ఖాళీ అయిపోయింది 

Advertisement

మామూలుగా చాలామంది నిర్మాతలకు ఒక క్లారిటీ ఉంటుంది. సినిమాని ఎంతలా ప్రమోట్ చేసినా కూడా సినిమా రిజల్ట్ బట్టి ఆడియన్స్ ఆ సినిమాని ఆదరిస్తారు అనే క్లారిటీ అందరికీ ఉంది. అయితే ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలకు కూడా ఊహించిన స్థాయి సక్సెస్ రాలేదు. గతవారం పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాలేవి విడుదల కాలేదు. ఆ వారాన్ని అందరూ వదిలేశారు.

కిరణ్ అబ్బవరం క సినిమా తర్వాత ఇప్పటివరకు ఆ స్థాయి సక్సెస్ అందుకోలేదు. అంతకుముందు కిరణ్ కెరియర్ లో వరుసగా డిజాస్టర్లు పడ్డాయి. క సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత చేసిన దిల్రుబా అంటే సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి.

Advertisement

రీసెంట్ టైమ్స్ లో ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది కాబట్టి కిరణ్ ఎంటర్టైన్మెంట్ సినిమాను చేశాడు. ఈ సినిమా రేపు ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాకి ఊహించిన సక్సెస్ వచ్చింది అంటే ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.

టీం కాన్ఫిడెన్స్ 

ఈ సినిమా మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ చిత్ర యూనిట్ కి ఉంది. కిరణ్ కూడా ఈ సినిమాను విపరీతంగా ప్రమోట్ చేశాడు. ఈ సినిమా ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది అని ముందు నుంచి ఆడియన్స్ ను ప్రిపేర్ చేస్తూ వచ్చారు.

ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ లో కూడా కచ్చితంగా ఈ సినిమాకు సక్సెస్ ఈవెంట్ పెడతాను అప్పుడు మా టీం అంతటి గురించి కూడా మాట్లాడుతాను అని కిరణ్ చెబుతూ వచ్చాడు. కిరణ్ మాటలు బట్టి చూస్తే ఈ సినిమా మీద అతనికి ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతుంది.

Also Read: Dil Raju : వివి వినాయక్ కు వచ్చిన పరిస్థితి దేవిశ్రీకి వస్తుందా? దిల్ రాజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా?

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×