Wife Kills Husband: హనుమకొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెద్ద పెండ్యాల గ్రామానికి చెందిన యాదలక్ష్మికి అశోక్ అనే వ్యక్తితో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అశోక్ హైదరాబాద్ హోటల్‌లో పనిచేస్తుంటాడు. గత కొన్ని రోజులుగా భార్య ప్రవర్తనలో అనుమానం రావడంతో యాదలక్ష్మిని ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఓ రోజు ఇంటికి మద్యం మత్తులో వచ్చి గొడవ పడ్డాడు. దీంతో యాదలక్ష్మి డయిల్100 కి ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పాట్‌కి వచ్చి.. మద్యం మత్తులో ఉన్న అశోక్‌ను గమనించి నచ్చ చెప్పి వెళ్ళిపోయారు. పోలీసులు వెళ్లిన అనంతరం యాదలక్ష్మి తన కుమార్తెల సహాయంతో చీరతో మెదడకు ఉరేసి హత్యచేసింది. తర్వాత పోలీసులు ఫోన్ చేసి సమాచారాన్ని తెలిపింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆపై యాదలక్ష్మితో పాటు ఇద్దరి పిల్లలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.