Varalakshmi -Sarath Kumar: సౌత్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు శరత్ కుమార్(Sarath Kumar). హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో సినిమాలు చేస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా శరత్ కుమార్ డ్యూడ్(Dude) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలైన నేపథ్యంలో తెలుగులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటుడు శరత్ కుమార్ పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన కుమార్తె వరలక్ష్మి సినీ కెరియర్ గురించి ఈయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ సినీ ప్రస్థానం చూస్తుంటే నాకు చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఒకరోజు తనతో మాట్లాడుతూ.. రైటర్లు ఒక సినిమా స్టోరీ రాసేటప్పుడు వరలక్ష్మి అని పేరు పెట్టి ఆమె కోసం ప్రత్యేకంగా ఒక పాత్ర రాస్తున్నారని చెప్పారు.
ఇలా తన కూతురి కోసం ప్రత్యేకంగా ఒక పాత్రను రాస్తున్నారు అంటే తండ్రిగా ఆ విషయంలో తాను చాలా గర్వపడుతున్నానని శరత్ కుమార్ తెలియజేశారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల కాలంలో తెలుగు తమిళ భాష సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే కెరియర్ మొదట్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె తను హీరోయిన్ గా సెట్ అవ్వదని భావించి విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా నెగిటివ్ రోల్ లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నేపథ్యంలో తదుపరి వరలక్ష్మికి నెగిటివ్ పాత్రలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.
డైరెక్టర్ గా మారనున్న వరలక్ష్మి..
ప్రస్తుతం ఈమె నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు దర్శకురాలిగా కూడా మారిన సంగతి తెలిసిందే. త్వరలోనే వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఇక వరలక్ష్మి తెలుగులో క్రాక్ సినిమా ద్వారా నెగిటివ్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగులో పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇటీవల హనుమాన్ సినిమాతో మరో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ కుమార్ తన స్నేహితుడు నికోలై అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వరలక్ష్మీ వైవాహిక జీవితంలోనూ, వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా, సంతోషంగా గడుపుతున్నారు.
Also Read: Big tv Kissik Talks: నన్ను తీసుకెళ్లిపో శివయ్యా.. హరితేజ కోరికలు వింటే షాక్ అవ్వాల్సిందే.. బాబోయ్!