Walking Or Workout: బరువు తగ్గడానికి ‘వాకింగ్’ మంచిదా లేక ‘వర్కవుట్’ (జిమ్‌లో చేసే వ్యాయామం) మంచిదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వాస్తవానికి, రెండింటికీ వాటి వాటి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఏది “ఉత్తమమైనది” అనేది మీ లక్ష్యాలు, ఆరోగ్య పరిస్థితి, సమయాన్ని బట్టి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వర్కవుట్: ఎక్కువ కేలరీలను తక్కువ సమయంలో కరిగించడం !
జిమ్ వర్కవుట్స్.. ముఖ్యంగా హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ , రన్నింగ్ , స్పిన్నింగ్, లేదా వెయిట్ ట్రైనింగ్ వంటివి తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తాయి.
అధిక కేలరీలు: సాధారణంగా.. ఒకే సమయంలో వాకింగ్ కంటే ఇంటెన్స్ వర్కవుట్స్ ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తాయి. ఉదాహరణకు.. 30 నిమిషాల రన్నింగ్‌తో అదే సమయంలో చేసే వాకింగ్ కంటే రెండింతలు ఎక్కువ కేలరీలను ఖర్చు చేయవచ్చు.
కండరాల నిర్మాణం: వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల కండరాలు పెరుగుతాయి. కండరాలు పెరిగితే..విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మీ శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి చాలా కీలకంగా మారుతుంది.
వాకింగ్: స్థిరత్వం, తక్కువ ప్రభావం:
వాకింగ్ అనేది అత్యంత అందుబాటులో ఉండే.. తక్కువ ప్రభావం కలిగిన వ్యాయామం. దీని వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
అందుబాటు: వాకింగ్‌కు ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. ఎక్కడైనా చేయొచ్చు. దీనిని ప్రతిరోజూ.. సులభంగా, స్థిరంగా చేయవచ్చు. ఇది తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
తక్కువ గాయాల ప్రమాదం: ఇది తక్కువ ప్రభావం కలిగిన వ్యాయామం కాబట్టి.. కీళ్లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. కొత్తగా వ్యాయామం మొదలు పెట్టేవారికి, వయస్సు మళ్లిన వారికి లేదా గాయాల నుంచి కోలుకుంటున్న వారికి ఇది బెస్ట్.
మానసిక ఆరోగ్యం: వాకింగ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా నిద్ర నాణ్యతను పెంచుతుంది. భోజనం తర్వాత 15-20 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: డైలీ మార్నింగ్ ఇలా చేస్తే.. ఫ్యాటీ లివర్ సమస్య దూరం
బరువు తగ్గడానికి ఏది ఉత్తమం ?
బరువు తగ్గడానికి ముఖ్య సూత్రం కేలరీల లోటు. అంటే.. తీసుకున్న కేలరీల కంటే ఎక్కువ కేలరీలను ఖర్చు చేయాలి.
తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలనుకుంటే: అధిక తీవ్రత కలిగిన వర్కవుట్స్ చేయడం మంచిది.
దీర్ఘకాలిక ఫలితాలు: రోజువారీ వాకింగ్, వారానికి 2-3 సార్లు వర్కవుట్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Also Read: ఈ 4 వ్యాధులు కంటికి హాని కలిగిస్తాయ్ ! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
కేవలం వాకింగ్ ద్వారా కూడా బరువు తగ్గడం సాధ్యమే. అయితే.. వాకింగ్ యొక్క వేగం , దూరం, సమయాన్ని పెంచడం ద్వారా దాని తీవ్రతను పెంచాలి. బరువు తగ్గడానికి ఉత్తమమైన వ్యాయామం ఏదంటే.. మీరు క్రమం తప్పకుండా ఆనందంగా చేసే వ్యాయామమే అని నిపుణులు చెబుతున్నారు. ఆహార నియంత్రణతో పాటు.. వాకింగ్, స్ట్రెంగ్త్ వర్కవుట్‌లను కలిపిన ప్రణాళిక ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది.