ఏపీలో రాజకీయం మెల్లగా ఉచితాలనుంచి అభివృద్ధివైపు మళ్లింది. నిన్న మొన్నటి వరకు సూపర్ సిక్స్ హామీలపై విమర్శలు, ప్రతి విమర్శలు వింటూనే ఉన్నాం. కానీ కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీల నిర్మాణం, విశాఖకు విదేశీ కంపెనీల పెట్టుబడులు.. ఇలాంటి వ్యవహారల చుట్టూ తిరుగుతోంది. ఒకరకంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే ఈ కాంపిటీషన్ లో కూడా వైసీపీ వెనకబడిందని అంటున్నారు నెటిజన్లు.
విశాఖకు గూగుల్..
విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ని తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ అక్షరాలా 1,33,000 కోట్లు. లక్షా 88వేలమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా. దీంతో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. చంద్రబాబు ప్రభుత్వం సాధించిన అద్భుత విజయం ఇది అంటూ కూటమి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి ప్రధాని మోదీ సహకారం కూడా మెండుగా ఉందని అంటున్నారు. అయితే ఇక్కడ వైసీపీ ఇరుకున పడింది. విశాఖకోసం చంద్రబాబు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, గతంలో జగన్ ఏం చేశారు అనే చర్చ మొదలైంది. టీడీపీ కూడా ఈ పాయింట్ తో జగన్ ని బాగానే ఇరుకున పెట్టాలని ప్లాన్ చేసింది. పాత వీడియోలు ఒక్కొక్కటీ బయటకు తీస్తు వైసీపీని టార్గెట్ చేసింది. గతంలో జగన్ హయాంలో ప్రతి ఊరిలో ఫిష్ ఆంధ్రా పేరుతో యువతకోసం షాపులు ప్రారంభించారు. జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి అదేనని, చంద్రబాబు మాత్రం యువతకు అలాంటి ఉద్యోగాలు కాకుండా, ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారని టీడీపీ చెబుతోంది. జగన్ ని కౌంటర్ చేస్తూ వీడియోలు వదులుతోంది.
జగన్ పొదగని గుడ్లు
సీబీఎన్ తెచ్చిన గూగుల్
చేపలు, రొయ్యలు దుకాణాలు తెరవడం, గుడ్లు పొదిగించడం ఐదేళ్లలో చేశారు జగన్.
ఏడాదిన్నర పాలనలోనే రూ.1.33 లక్షల కోట్ల గూగుల్ డేటా సెంటర్ ఏపీకి తీసుకువచ్చారు సీబీఎన్. #YoungestStateHighestInvestment#GoogleComesToAP#InvestInAP… pic.twitter.com/vBkHNiuuqs— Telugu Desam Party (@JaiTDP) October 17, 2025
విశాఖకు ఎవరేం చేశారు?
వాస్తవానికి విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించి అప్పట్లో జగన్ పెద్ద సాహసం చేశారు. ఆ నిర్ణయంతో విశాఖ వాసులు కూడా సంతోషపడ్డారు. కానీ జగన్ హయాంలో విశాఖకు ఏం జరిగింది? ఏం ఒరిగింది? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం కష్టం. రుషికొండకు గుండు కొట్టి ప్యాలెస్ కట్టారని, దాని వల్ల ఎవరికి ఉపయోగం అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అదే సమయంలో ఏపీకి అమరావతి ఏకైక రాజధాని అని ప్రకటించిన చంద్రబాబు, విశాఖను కూడా అభివృద్ధి చేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ లేకపోయినా విశాఖను అంతకు మించి అభివృద్ధి చేస్తున్నారని అంటున్నారు. గూగుల్ కంపెనీ రాకతో విశాఖ రూపు రేఖలు మారిపోతాయని, ఏపీలోని యువతకు ఉపాధి అవకాశాలు వెల్లువలా వస్తాయని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
Also Read: ప్రధాని మోదీని వైసీపీ నేతలు కలిశారా లేదా?
వైసీపీ తక్షణ కర్తవ్యం..
నవరత్నాల హామీలతో మ్యాగ్జిమమ్ ప్రజలకు మంచి చేశామని వైసీపీ భావిస్తుంటే, అంతకు మించి ప్రతి పథకానికీ ఫలితం పెంచి అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. వైసీపీ హయాంలో లేని, రాని కంపెనీలు కూటమి రాగానే ఏపీకి క్యూ కట్టడం విశేషం. సంక్షేమంతోపాటు, అభివృద్ధిని కూడా కూటమి చేసి చూపెడుతోందని అంటున్నారు మూడు పార్టీల నేతలు. ఈ ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలని వైసీపీ ఆలోచిస్తోంది.
Also Read: లోకేష్ కోడి-గుడ్డు కామెంట్స్