People Media Factory: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఒకటి. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ లో దాదాపు 50 సినిమాలు పూర్తి అయిపోతున్నాయి. 50 సినిమాలు పూర్తి అవుతున్నప్పుడు కనీసం చెప్పుకోవడానికి సూపర్ హిట్ సినిమాలు 25 అయినా కూడా ఉండాలి. కానీ ఈ ప్రొడక్షన్ హౌస్ లో గట్టిగా మాట్లాడితే 10 సినిమాలు కూడా అద్భుతమైన సక్సెస్ రేట్ సాధించలేకపోయాయి.
ఈ ప్రొడక్షన్ హౌస్ లో గట్టిగా సక్సెస్ సాధించిన సినిమాల విషయానికి వస్తే గూడఛారి, కార్తికేయ, ధమాకా, మిరాయి వంటి సినిమాలు పేర్లు వినిపిస్తాయి. అయితే సోలోగా ఈ బ్యానర్ పేరును నిలబెట్టిన సినిమా ఇప్పటివరకు కూడా ఒక్కటంటే ఒకటి కూడా రాలేదు. పవన్ కళ్యాణ్ లాంటి హీరోను నమ్ముకున్న కూడా, బ్రో సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలోనూ కూడా ముందుంటుంది ఈ ప్రొడక్షన్ హౌస్. కానీ కథల ఎన్నిక విషయంలో ఎక్కడో వెనకబడినట్లు అనిపిస్తుంది.
ఒక ప్రొడక్షన్ హౌస్ దాదాపు 50 సినిమాలు నిర్మించింది అంటే. కనీసం ఒక సినిమా అయినా కూడా కల్ట్ క్లాసిక్ అనిపించుకునేలా ఉండాలి. అలాంటి సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి లేకపోవడం ఆశ్చర్యం. చాలామంది పెద్దపెద్ద నటులతో సినిమాలు చేసినా కూడా అవి వేరే బ్యానర్ తో కంబైన్డ్ గా చేయడం వలన ఈ బ్యానర్ కి ఊహించిన రేంజ్ నేమ్ రాలేదు.
కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ నిర్మించినవి కొన్ని సినిమాలే అయినా కూడా మంచి పేరు ఆ బ్యానర్స్ కు లభించింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ విషయానికి వస్తే రంగస్థలం, శ్రీమంతుడు వంటి సినిమాలను ఉదాహరణలుగా చెప్పొచ్చు.
స్వధర్మ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ఇప్పటివరకు నిర్మించిన మూడు సినిమాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. హారిక హాసిని క్రియేషన్స్ లో కూడా చెప్పుకోదగ్గ అద్భుతమైన సినిమాలు వచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఇలా చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. గతంలో పీపుల్ మీడియా సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. మా బ్యానర్ కు ఈ సినిమా చాలా ప్రత్యేకం అని చెప్పారు. ఈ సినిమా సక్సెస్ అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి మంచి పేరును తీసుకొస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఈ బ్యానర్ నుంచి నేడు తెలుసు కదా సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ఊహించిన రేంజ్ టాక్ అయితే మాత్రం రావడం లేదు. ఇదే సిద్దు సితార ఎంటర్టైన్మెంట్స్ లో డీజే టిల్లు సినిమా చేసినప్పుడు మంచి సక్సెస్ సాధించి విపరీతమైన పేరు వచ్చింది. అయితే ఈ బ్యానర్లో రాజరాజ చోరా, స్వాగ్, తెలుసు కదా వంటి డీసెంట్ హిట్ సినిమాలు ఉన్నా కూడా వాటిని ప్రమోట్ చేసుకోవటంలో ఈ బ్యానర్ విఫలం అవుతుంది.