E-Paper
Advertisement

Jatadhara Trailer: మంత్ర బంధనాలతో ‘జటాధర’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Jatadhara Trailer: మంత్ర బంధనాలతో ‘జటాధర’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!
Advertisement

Jatadhara Trailer: సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “జటాధర”(Jatadhara). వెంకటేష్ కళ్యాణ్ అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఈసారి కచ్చితంగా సుధీర్ బాబు(Sudheer Babu) హిట్ కొడతారని స్పష్టం అవుతుంది. ఈ సినిమా తెలుగు హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.

ధనపిశాచిగా సోనాక్షి సిన్హా..

ఈ సినిమా ద్వారా నటి సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో ఈమె ధన పిశాచి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారనే చెప్పాలి. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. పూర్వం దనాన్ని దాచిపెట్టే మంత్రాలతో బంధనాలు వేసేవాడు అనే డైలాగులతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది అలాగే ధనపిశాచిగా సోనాక్షి సిన్హా తన నటనతో అదరగొట్టారని చెప్పాలి. ఇక శిల్పా శిరోద్కర్(Shilpa Shirodkar) నటన కూడా హైలెట్ గానే నిలిచింది ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మైథాలాజికల్ , సూపర్ నాచురల్ థ్రిల్లర్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.

తెలుగు,హిందీ భాషలో విడుదల..

Advertisement

ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, అవసరాల శ్రీనివాస్ వంటి వారి పాత్రలు కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సుధీర్ బాబు హిట్ కొడతారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్‌ కె.ఆర్‌.భన్సాల్, ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. ఏకకాలంలోనే ఈ సినిమా తెలుగుతోపాటు హిందీలో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) రంగంలోకి దిగడంతో ట్రైలర్ వీడియోకి మంచి ఆదరణ లభిస్తుంది.

Advertisement

ఇటీవల కాలంలో నటుడు సుధీర్ ఎన్నో విభిన్నమైన సినిమా కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అయితే ఈ సినిమాలు మాత్రం అనుకున్న విధంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. మరి సరికొత్త కాన్సెప్ట్ తో జటాధర అనే సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇదివరకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ ఇతర పోస్టర్లు కూడా సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. నవంబర్ 7వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా సుధీర్ బాబుకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Varalakshi -Sarath Kumar: కూతురి విషయంలో గర్వపడుతున్న హీరో..ఆ మాట చాలంటూ!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×