Dil Raju : జబర్దస్త్ షో తో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు వేణు. వేణు జబర్దస్త్ చేయక ముందు నుంచే సినిమాల్లో కొద్దిపాటి గుర్తింపును సాధించుకున్నాడు. కానీ జబర్దస్త్ అనే షో కేవలం వేణుకు మాత్రమే కాకుండా చాలా మందికి మంచి పేరును తీసుకొచ్చింది. ఆ రోజుల్లో ఒక కాంట్రవర్సీలో కూడా ఇరుక్కుపోయాడు వేణు.
సుదీర్ఘ ప్రయత్నాలు తర్వాత బలగం అనే సినిమాతో దర్శకుడుగా మారాడు. ప్రియదర్శి నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో తెరబొమ్మలు వేసుకొని మరి ఆ సినిమాను చూశారు. తెలంగాణ సంస్కృతిని వేణు చూపించిన విధానం చాలామందిని కదిలించింది. నేచురల్ స్టార్ నాని లాంటి వాళ్లు కూడా వేణు చేసిన ఆ సినిమాకు ఫిదా అయిపోయారు.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేరు వివి వినాయక్. వినాయక్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాకి కూడా వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత చేసిన ఇంటిలిజెంట్ అనే సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.
అయితే వివి వినాయక హీరోగా సీనయ్య అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఆ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు అప్పట్లో నెలకొన్నాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సినిమాను పక్కన పెట్టేశారు. ఇప్పుడు వేణు దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ హీరోగా ఎల్లమ్మ అనే సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే వి వి వినాయక్ కు చేసినట్లు మధ్యలోనే ప్రాజెక్టు వదిలేస్తారా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.
బలగం వేణు – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో “ఎల్లమ్మ” సినిమా అనే ఊహగానాలు మొదలయ్యాయి. గతంలోనే కుమారి 21ఎఫ్ సినిమా ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్ ని నేను నా ఎస్వీసీ బ్యానర్ లో సుకుమార్ దర్శకత్వంలో పరిచయం చేస్తాను అని దిల్ రాజు మాట ఇచ్చాడు.
ఇది ఏమైనప్పటికీ వీవీ వినాయక్ హీరో గా దిల్ రాజు నిర్మాతగా శీనయ్య సినిమా లాగా మధ్యలో ఆగిపోయినట్టు కాకపోతే చాలు అని అనుకుంటున్నారు అభిమానులు.
ఎల్లమ్మ సినిమా విషయానికి వస్తే బలగం వేణు దర్శకత్వంలో మొదట నితిన్, తరువత నాని, నిఖిల్, బెల్లంకొండ సాయి ఇలా చాలా పేర్లే వినిపించాయి. ఈరోజు సంగీత దర్శకుడు దేవి పేరు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వార్త. మొత్తానికి దిల్ రాజు చెప్పినట్లు దేవి శ్రీ హీరో కానున్నారు. కాకపోతే సుకుమార్ కాకుండా వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి.
Also Read: Ritu Demon : హౌస్ లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ, లవ్ లేకుండానే హగ్స్.?