Lasya -Roja: ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటీనటులు కూడా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితం నటుడు వరుణ్ సందేశ్, వితిక దంపతులు నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా యాంకర్ లాస్య(Lasya) కూడా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారని తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తమ కొత్త ఇంటికి సంబంధించి ఎన్నో రకాల వీడియోలను షేర్ చేశారు.
దసరా పండుగ సందర్భంగా ఈ దంపతులు చాలా సింపుల్ గా గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. అయితే తాజాగా మరోసారి ఈమె తన కొత్త ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలను, బుల్లితెర నటీనటులను ఆహ్వానించారని తెలుస్తుంది. చాలా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం జరిగిందని తెలుస్తోంది. ఇకపోతే ఈ గృహప్రవేశ కార్యక్రమాలలో భాగంగా సినీనటి రోజా(Roja) పాల్గొని సందడి చేశారు. తాజాగా లాస్య అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.
ఇటీవల రోజా తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రసారమైన డ్రామా జూనియర్ కార్యక్రమంలో రోజా జడ్జిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో లాస్య కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లాస్యతన కొత్త ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో భాగంగా రోజాకు ప్రత్యేక ఆహ్వానం అందజేయడంతో రోజా ఈ గృహప్రవేశ వేడుకలలో పాల్గొని సందడి చేశారు. అనంతరం లాస్య, మంజునాథ్(Manjunath) దంపతులను ఆశీర్వదించినట్లు తెలుస్తోంది.
మీ ఆశీర్వాదాలు మాకు ప్రత్యేక…
ఇలా రోజా తన ఇంట్లో జరిగిన ఈ వేడుకకు హాజరు కావడంతో లాస్య దంపతులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఆమెతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. మీ సమయాన్ని వెచ్చించి మా గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు.. మీ ఆశీర్వాదాలతో ఈరోజు మాకు మరింత ప్రత్యేకంగా మారింది అంటూ ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసినా అభిమానులు లాస్య దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా త్వరలోనే తన హోమ్ టూర్ వీడియోని కూడా షేర్ చేయాలి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో లాస్య బుల్లితెర కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Rekha Boj: కిడ్నీలు అమ్మి అయినా సినిమా చేస్తా.. నటి సంచలన వ్యాఖ్యలు!