Mirai Part 2 : ప్రముఖ యంగ్ హీరో తేజ సజ్జా (Teja sajja) సూపర్ యోధ పాత్రలో తాజాగా నటించిన చిత్రం మిరాయ్. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మొదటిరోజు రూ.27 కోట్లు రాగా.. రెండవ రోజు రూ.55 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇకపోతే ఇంత పెద్ద విజయం తనకు అందించినందుకు మీడియా మిత్రులకు, అభిమానులకు, సినీ ప్రేక్షకులకు తేజా సజ్జా ఇటీవల సక్సెస్ మీట్ లో భాగంగా పాదాభివందనం చేసిన విషయం తెలిసిందే.
తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్ గా నటించగా మంచు మనోజ్ విలన్ గా నటించారు. శ్రియా శరణ్ (Shriya Saran), జగపతిబాబు (Jagapathi Babu) కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి “వైబ్ ఉందిలే బేబీ వైబ్ ఉందిలే” అనే పాట ఏ రేంజ్ లో పాపులారిటీ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ పాటను థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని చాలామంది థియేటర్ కి వెళ్ళగా.. అక్కడ అభిమానులకు నిరాశ మిగిలిందనే చెప్పాలి. ఈ పాటను సినిమా నుండి తీసేయడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు.
పార్ట్ 2 లో ఐటమ్ సాంగ్..
అంతేకాదు ఇప్పుడు ఈ సినిమాలో వైబ్ పాటను తీసేసినా. పార్ట్ 2 ఉంటుందని అందులో ఈ వైబ్ సాంగ్ తరహాలో “చయ్యా.. చయ్యా ” అనే స్పెషల్ సాంగ్ ఉండనుంది అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు సినిమా నుండి వైబ్ పాటను తొలగించడంపై కూడా క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ కార్తీక్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మాట్లాడుతూ.. “ఈ కథను వెబ్ సిరీస్ గా తీసి ఉంటే.. మరింత వివరంగా చెప్పేవాడిని. కథకు అడ్డం వస్తుందని తొలగించాము. కానీ ఈ వైబ్ పాటకు అంతే ధీటుగా ఉండే “చయ్యా చయ్యా” పాటను పార్ట్ 2 లో చూపించబోతున్నాను.ఇందులో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అలరించబోతోంది”
అంటూ పార్ట్ 2 పై క్లారిటీ ఇస్తూనే.. వైబ్ పాట ఇక లేనట్టే అని హింట్ ఇచ్చేశారు కార్తిక్ ఘట్టమనేని. మొత్తానికైతే ఓటిటిలోకి వచ్చినప్పుడైనా ఈ పాట యాడ్ చేస్తారేమో చూడాలి అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
మిరాయ్ సినిమా విశేషాలు..
మిరాయ్ సినిమా విశేషానికి వస్తే.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. తేజ ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారగా ఇప్పుడు ఈ సినిమాతో మరో ఊహించని విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పవచ్చు. శ్రియా శరణ్ కూడా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. మంచు మనోజ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే రితిక నాయక్ పాత్రకు పెద్ద స్కోప్ లేకపోయినా.. తన నటనతో సినిమాను ముందుకు నడిపించింది.. ఇలా ఎవరికి వారు ఈ సినిమాలో తన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు అని చెప్పవచ్చు.
ALSO READ: Sai Durga Tej: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన మెగా మేనల్లుడు.. అమ్మాయి ఎవరంటే?