Soaked Almonds Vs Walnuts: సాధారణంగా నట్స్‌లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలో బాదం, వాల్‌నట్‌లు ముఖ్యమైనవి. ఇవి రెండూ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని నానబెట్టి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. నానబెట్టిన బాదం, వాల్‌నట్స్‌లో ఏది మెదడుకు ఎక్కువ ప్రయోజనకరం అనే వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నానబెట్టిన బాదం VS నానబెట్టిన వాల్‌నట్‌లు: మెదడుకు ఏది మంచిది ?
నానబెట్టిన బాదంలో విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయ పడతాయి. నానబెట్టిన వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ (ALA) ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనవి. ఇవి మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. అంతే కాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. అంతే కాకుండా నిద్రలేమి సమస్యను కూడా దూరం చేస్తాయి.
పోలిక:
పోషకాలు: వాల్‌నట్స్‌లో బాదంపప్పుతో పోలిస్తే.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో.. బాదంపప్పులో విటమిన్ E , మెగ్నీషియం అధికంగా ఉంటాయి.
జీర్ణక్రియ: నానబెట్టడం వల్ల బాదం, వాల్‌నట్‌లు రెండూ సులభంగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే ఫైటిక్ ఆమ్లం తొలగిపోవడం వల్ల పోషకాల శోషణ మెరుగు పడుతుంది.
మెదడుకు ప్రయోజనాలు:
నానబెట్టిన బాదం: మెదడు కణాలను డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా శక్తిని మెరుగు పరుస్తుంది.
నానబెట్టిన వాల్‌నట్‌లు: ఇవి మెదడులోని నరాల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరుస్తాయి, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తాయి. మెదడు వాపును తగ్గించడంలో సహాయ పడతాయి.
Also Read: జామ ఆకులను ఇలా వాడితే.. మీ రోగాలన్నీ మాయం !
ఏది తింటే బెటర్ ?
బాదం, వాల్‌నట్‌లు రెండూ మెదడుకు మంచివే. నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఏదో ఒకటి మాత్రమే తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత: మెదడు కణాల రక్షణ, జ్ఞాపకశక్తికి నానబెట్టిన బాదం చాలా మంచిది.
ఒత్తిడి, నిద్రలేమి: ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు నానబెట్టిన వాల్‌నట్స్‌ను ఎంచుకోవచ్చు.
ఎలా తీసుకోవాలి ?
రాత్రి పడుకునే ముందు 4-5 బాదం లేదా 2-3 వాల్‌నట్‌లను నీటిలో నానబెట్టండి. ఉదయం బాదం పొట్టు తీసి తినాలి. రెండింటినీ కలిపి తినడం వల్ల మరింత మంచి ఫలితాలు ఉంటాయి. నానబెట్టిన బాదం, వాల్‌నట్‌లను రోజూ తీసుకోవడం వల్ల మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా రోజంతా చురుకుగా ఉంటారు.