Sai Durga Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు విలక్షణమైన నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన అనూహ్యంగా బైక్ యాక్సిడెంట్ జరిగి ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా కొన్ని రోజులు కోమాలోకి కూడా వెళ్లిన సాయి ధరంతేజ్.. ఆ తర్వాత ఆరోగ్యంగా బయటపడ్డారు. తను ఆరోగ్యంగా బయటకు రావడానికి అభిమానులు, కుటుంబ సభ్యులతో పాటు తన తల్లి ప్రధాన పాత్ర పోషించారు అని చెప్పిన ఈయన.. అందులో భాగంగానే తన తల్లి పేరును తన పేరుగా మార్చుకొని సాయి దుర్గ తేజ్ గా చలామణి అవుతున్నారు.
యాక్సిడెంట్ తర్వాత తొలిసారి సాయి దుర్గా తేజ్ చేసిన చిత్రం బ్రో. ఇందులో తన మేనమామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా నటించారు. ఇక ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత సోలో హీరోగా వచ్చిన చిత్రం ‘విరూపాక్ష’. ఈ సినిమా మంచి విజయం అందుకున్నా.. ఇందులో సాయి దుర్గా తేజ్ నటన పెద్దగా లేదనే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ అనే సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా తన బ్రేకప్ పై తొలిసారి స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచారు సాయి దుర్గా తేజ్. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
పెళ్లిపై కామెంట్స్..
39 సంవత్సరాల వయసు వచ్చినా..అటు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటున్నా…ఇప్పటికీ తన పెళ్లి పై నోరు విప్పలేదు సాయి దుర్గా తేజ్. దీనికి తోడు ఈయన తోటి నటీనటులు అందరూ పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కూడా కంటుంటే.. ఈయన మాత్రం వివాహానికి దూరంగానే ఉన్నారు. దీంతో ఈయనపై ఎప్పుడు కప్పుడు ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చిన ఈయన.. ఇన్నాళ్లకు కాన్పిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) లో భాగంగా హైదరాబాదులో నిర్వహించిన “అభయమ్ మసూమ్ సమ్మిట్ 2025” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈయన.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
మీడియా వల్లే బ్రేకప్ అంటూ..
సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ..” 2023లో నాకు బ్యాడ్ బ్రేకప్ జరిగింది. నాది చాలా విచారకరమైన స్టోరీ.. ఈ బ్రేకప్ కూడా మీడియా వల్లే అయింది. మీడియా మిత్రులు నాపై చాలా ప్రేమను కురిపిస్తూ ఆ అమ్మాయితో పెళ్లి.. ఈ అమ్మాయితో పెళ్లి అంటూ చాలా గాసిప్స్ క్రియేట్ చేశారు. నన్ను ఊపిరి పీల్చుకోనివ్వకుండా వార్తలు రాశారు. దానివల్ల నాకు బ్రేకప్ అయ్యింది. ఆ అమ్మాయి నాకు కాలేజ్ గర్ల్ ఫ్రెండ్. రోజుకొక మీడియా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ అమ్మాయి కూడా భరించలేక నాకు బ్రేకప్ చెప్పింది. ఇప్పుడు మీడియా వాళ్లే నా పెళ్లి బాధలు తీసుకోవాలని కోరుకుంటున్న.. దయచేసి సైలెంట్ గా ఉంటే నా మ్యారేజ్ గురించి నేనే అనౌన్స్ చేస్తాను. మీరందరూ కామ్ గా ఉంటేనే నేను నా పెళ్లి గురించి ప్రకటన ఇస్తాను. మీ అందరికీ దండం పెడతా.. కొద్దిరోజులు సైలెంట్ గా ఉండండి” అంటూ మీడియా మిత్రులకు తెలిపారు సాయి దుర్గ తేజ్. మొత్తానికైతే మీడియా వల్లే తన బ్రేకప్ జరిగిందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
ALSO READ:Bigg Boss 9: సందడి చేసిన మిరాయ్ టీం.. ఇమ్మానుయేల్ దెబ్బకు తేజ ఏం చేశారంటే?