IND VS PAK : ఆసియా కప్ 2025లో భాగంగా కొద్ది గంటల్లోనే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత జరుగుతున్న తొలి పోరు కావడంతో వరల్డ్ వైడ్ గా ఈ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. మరోవైపు కొందరూ పాకిస్తాన్ జట్టుతో అస్సలు క్రికెట్ ఆడొద్దనే డిమాండ్లు చేస్తున్నారు. కానీ బీసీసీఐ ఆసియా కప్ లో ఆడేందుకు టీమిండియాకి అనుమతి ఇచ్చింది. మరోవైపు టీమిండియా అభిమానులు కొందరూ పాకిస్తాన్ తో టీమిండియా ఆడొద్దని.. సోషల్ మీడియా బాయ్ కాట్ అంటూ పోస్టులు చేస్తున్నారు. బాయ్ కాట్ డిమాండ్ నేపథ్యంలో ఆసియా కప్ లో ఇవాళ పాకిస్తాన్ తో టీమిండియా ఆడకపోతే తరువాత మ్యాచ్ లో ఒమన్ తో తప్పక గెలవాలి. గ్రూపులోని మిగతా జట్లు ప్రదర్శన ఆధారంగా సూర్య సేన సూపర్ 4 కి చేరనుంది.
Also Read : IND Vs PAK : పాకిస్థాన్ తో మ్యాచ్… దొంగ చాటున మ్యాచ్ చూస్తున్న టీమిండియా అభిమానులు !
పాక్ కూడా వచ్చి, భారత్ బాయ్ కాట్ కొనసాగిస్తే.. మిగతా రెండు మ్యాచ్ లు గెలవాలి. ఒకవేళ భారత్, పాకిస్తాన్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తే.. టోర్నీ దాయాది సొంతం అవుతుంది. వేరే జట్టు ఫైనల్ వస్తే అమీతుమీ తేల్చుకోవాలి. ఓవైపు బాయ్ కాట్ ట్రెండ్ కొనసాగుతుంది. మరోవైపు టీమిండియా ఆటగాళ్లపై సోషల్ మీడియా ప్రభావం పడకుండా మేనేజ్ మెంట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గ్రూపు ఏ ఉన్న భారత్, పాకిస్తాన్ రెండు ఇప్పటికే ఒక్కో విజయం సాధించి రెండు పాయింట్లతో సమానంగా ఉన్నాయి. నెట్ రన్ విషయంలో భారత్.. పాకిస్తాన్ కంటే చాలా ముందుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే చాలు గ్రూపు ఏ లో అగ్రస్థానంలో నిలిచి సూపర్ 4 కి అర్హత సాధిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో గెలిచి గ్రూపు టాపర్ గా నిలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Also Read : Shoaib Akhtar : రాసి పెట్టుకోండి… పాకిస్థాన్ ను టీమిండియా దారుణంగా ఓడించడం ఖాయం
ముఖ్యంగా ఆసియా కప్ లో ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఆకర్షణగా నిలుస్తుందనే చెప్పాలి. అయితే ఇటీవల వరల్డ్ ఛాంపియన్ షిప్ లెజెండ్స్ క్రికెట్ టోర్నీలో మన మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ తో ఆడేందుకు నిరాకరించి వైదొలిగారు. ఇప్పుడు అలాగే చేయవచ్చు కదా అని అభిమానులు పేర్కొంటున్నారు. కానీ అలా టీమిండియా క్రికెట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగదని.. ఒకవేళ మ్యాచ్ ని రద్దు చేస్తే.. పాయింట్లలో వెనుకంజలోకి వెళ్తామని కొందరూ తమ అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. . అది వన్డే ఫార్మాట్ అయినా.. టీ-20 ఫార్మాట్ అయినా ఇరు జట్ల మధ్య తీవ్ర ఒత్తిడి, ఉత్సాహం, డ్రామాతో నిండిన మ్యాచ్ లు జరిగాయి. ఆసియా కప్ లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో పాకిస్తాన్ కంటే భారత్ కే ఎక్కువగా విజయాలున్నాయి. భారత్ కఠినమైన పరిస్థితుల్లో కూడా గెలిచి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. 2025 ఎడిషన్ లో పాకిస్తాన్ తమ రికార్డును మెరుగుపరుచుకుంటుందో లేక భారత్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందో వేచి చూడాలి.