Katrina Kaif: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కత్రినా కైఫ్(Katrina Kaif) ఒకరు. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో కత్రినా కైఫ్ సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి. ఇక ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతూ నటుడు విక్కీ కౌశల్(Vicky Kaushal) ప్రేమలో పడి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇకపోతే కత్రినా కైఫ్ త్వరలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త సంచలనంగా మారింది.. కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్(Pregnant) అనే వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలకు కారణమైంది.
తల్లి కాబోతున్న కత్రినా కైఫ్?
కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా 2025లో తమ ఫ్యామిలీ ఇద్దరు కాస్త ముగ్గురు కాబోతున్నారు అని ఉన్న ఒక ఫోటో సంచలనంగా మారింది. దీంతో కత్రినా కైఫ్ త్వరలోనే తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారంటూ ఈ వార్తలను ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ వార్తల గురించి కత్రినా కైఫ్ లేదా వికీ కౌశల్ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ గురించి వార్తలు రావటం ఇది మొదటిసారి కాదు.
తెరపైకి ప్రెగ్నెన్సీ వార్తలు..
గతంలో కూడా కత్రినా కైఫ్ తల్లి కాబోతోందని ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తలలో నిజం లేదని కొట్టి పారేశారు. తాజాగా మరోసారి ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలు తెరపైకి రావడానికి కారణం లేకపోలేదు. ఇటీవల ఈ జంట అలీబాగ్‌కు పడవ ఎక్కుతున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించిన కొద్దిసేపటికే ప్రెగ్నెన్సీ వార్తలు తెరపైకి వచ్చాయి. ఇందులో ఈమె కాస్త వదులుగా ఉన్న దుస్తులు ధరించడమే కాకుండా బేబీ బంప్ లాగా కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు.
మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే కత్రినా లేదా విక్కీ కౌశల్ స్పందించాల్సి ఉంటుంది. ఇక విక్కీ కౌశల్ ఇటీవల రష్మిక మందన్నతో కలిసి నటించిన ఛావా (Chhaava) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులు అంచనాలను చేరుకొని సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన పలు బాలీవుడ్ సినిమాల పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక కత్రినా కైఫ్ ఇటీవల సినిమాలను కాస్త తగ్గించారు ఇక ఈమె తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాతో పాటు బాలయ్య హీరోగా నటించిన అల్లరి పిడుగు సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను నా కట్టుకోలేకపోయింది. ఇక ఈ రెండు సినిమాల తరువాత కత్రినా తెలుగు సినిమాలకు దూరమవుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్థిరపడ్డారు.
Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్ తో నటిస్తే మరణమే .. ఆందోళనలో బాలీవుడ్..ఇది వారి పనేనా?