Telangana RTC: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. దీనికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 3038 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు త్వరలోనో నోటిఫికేషన్ విడుదల కానుంది.
అయితే.. ఈ ఉద్యోగాలను టీజీపీఎస్సీనా.. లేదా ఇతర నియామక బోర్డు ద్వారా నియామకం జరపాలా..? అనేది ఇంకా క్లారిటీ రాలేదని టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయని ఆయన చెప్పారు. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తు కూడా ప్రారంభం అయిందని చెప్పారు. ఈ నియామకాలకు సంబంధించి అతి త్వరలోనే టీజీపీఎస్సీ లేదా ఇతర నియామకాల బోర్డు ద్వారా నోటిఫికేషణ్ విడుదల చేస్తామని వీసీ సజ్జనార్ తెలిపారు.
అయితే.. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సజ్జనార్ నిరుద్యోగ అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంత మంది మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. అలాంటి మోసపూరిత వ్యక్తుల పట్ల అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఉద్యోగంలో పెట్టిస్తాం.. డబ్బులు ఇవ్వండి.. అంటే అసలు నమ్మకూడదని తెలిపారు. ఇలాంటి వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తే.. తమకు తెలపాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు.
ఈ నియామక ప్రక్రియ మెరిట్ ఆధారంగా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే మెరిట్ లో వారికే ఉద్యోగం లభిస్తుందని అన్నారు. మోసపూరితంగా అడ్డదారిలో వచ్చేవారికి ఉద్యోగాలు లభించవని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ: IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..
ALSO READ: NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్