Salman Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) కు ఇటీవల పెద్దయితే బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది. అయితే ఈయనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang)నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో సల్మాన్ ఖాన్ సైతం పెద్ద ఎత్తున భద్రత చర్యలను తీసుకుంటున్నారు ఈయన ఎక్కడికి వెళ్లి నాకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలలోనే వెళ్తున్నారు. అలాగే తన ఇంటికి కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక సల్మాన్ ఖాన్ బయటకు వస్తున్నారంటే పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇలా నిత్యం సల్మాన్ ఖాన్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కపిల్ శర్మకు బెదిరింపులు
ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది నటీనటులకు లారెన్స్ గ్యాంగ్ నుంచి బెదిరింపు ఆడియో క్లిప్స్ వెళ్ళినట్టు సమాచారం. ఇక ఈ ఆడియో క్లిప్ ప్రముఖ హాస్య నటుడ, యాంకర్ కపిల్ శర్మకి(Kapil Sharma) కూడా వెళ్లిందని తెలుస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ తో ఎవరైనా నటించిన వారికి మరణం తప్పదని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో సంబంధం ఉన్న గ్యాంగ్ స్టర్ హ్యారీ బాక్సర్ ఈ ఆడియో రికార్డింగ్ విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఇలా కపిల్ శర్మతో పాటు మరి కొంతమందికి ఈ ఆడియో క్లిప్స్ వెళ్లడంతో పలువురు నటీనటులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.
కపిల్ శర్మ కేఫ్ పై దాడి
ఇక కపిల్ శర్మ సల్మాన్ ఖాన్ ను ఇటీవల ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ టాక్ షో కార్యక్రమానికి ఆహ్వానించడమే కారణమని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నేపథ్యంలో ఆయనకి కూడా ఈ హెచ్చరికలు వెళ్ళినట్టు సమాచారం. అదేవిధంగా కపిల్ శర్మ పై ఇటీవల లారెన్స్ గ్యాంగ్ వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. కెనడాలో ఈయన నిర్వహిస్తున్న క్యాప్స్ కేఫ్ (Kaps Cafe)పై వరుస దాడులు నిర్వహిస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్…
ఉగ్ర దాడిలో భాగంగా ఎలాంటి ప్రాణహాని లేకపోయిన కపిల్ శర్మ ఆస్తులను మాత్రం నాశనం చేశారని తెలుస్తోంది. ఇదివరకే కేఫ్ పై దాడి చేసి పెద్ద ఎత్తున నష్టం కలిగించారు అయితే మరమ్మత్తులు చేసి తిరిగి ఈ కేఫ్ ప్రారంభించగా మరోసారి ఈ కేఫ్ పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ విధంగా లారెన్స్ గ్యాంగ్ కపిల్ శర్మను కూడా టార్గెట్ చేసిన నేపథ్యంలో ఈ విషయం కాస్త బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలకు కారణమవుతుంది. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ తో నటించిన వారు ఎవరైనా కూడా చనిపోతారు అంటూ వార్నింగులు రావడంతో బాలీవుడ్ కాస్త అప్రమత్తం అయింది. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇటీవల సికిందర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఇక త్వరలోనే బిగ్ బాస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హోస్టుగా కూడా ఈయన వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?