E-Paper
Advertisement

Keerthy Suresh: కీర్తి సురేష్ కు అరుదైన గౌరవం.. యూనిసెఫ్ ఇండియా సెలబిట్రీ ప్రచారకర్తగా నియామకం

Keerthy Suresh: కీర్తి సురేష్ కు అరుదైన గౌరవం.. యూనిసెఫ్ ఇండియా సెలబిట్రీ ప్రచారకర్తగా నియామకం
Advertisement

Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేష్ కు అరుదైన గౌరవం దక్కింది. యూనిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ ప్రచారకర్తగా ఆమె నియమితులయ్యారు. పిల్లల, మానసిక ఆరోగ్యం, హక్కుల కోసం సెలబ్రిటీ అడ్వకేట్ గా వ్యవహరించనున్నట్టు యూనిసెఫ్ ఇండియా ప్రతినిథి సింథియా మెక్ కాఫ్రీ ఆదివారం ప్రకటించారు. అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులతో కలిసి కీర్తి సురేష్ ఈ కార్యక్రమంలో భాగంగా కానున్నారు. తనకు దక్కిన ఈ గౌరవంపై తాజాగా కీర్తి స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేసింది.

పిల్లల శ్రేయస్సు మన బాధ్యత..

Advertisement

పిల్లల శ్రేయస్సు మన బాధ్యత. మన పెంపకం, ప్రేమపూర్వక సంరక్షణ వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి పునాది వేస్తుందని అభిప్రాయపడింది. మరింత ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి తోడ్పడుతుందని పేర్కొంది. .వారి నేపథ్యం, సామర్యంతో సంబంధం లేకుండ ప్రతి ఒక్కరి అభివృద్ధికి సమాజంలో అవగాహనకు యూనిసెఫ్ ఇండియాతో చేతులు కలపడం నాకు గౌరవగా ఉందని కీర్తి తన స్టేట్మెంట్ పేర్కొంది. కాగా నేను శైలజా చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ మహానటితో నేషనల్ అవార్డు అందుకుంది.

నేషనల్ అవార్డు గ్రహిత

Advertisement

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో లెజెండరి నటి సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆమె లీడ్ రోల్ పోషించింది. అప్పటి వరకు వరుస ప్లాప్స్ చూసిన కీర్తి మహానటి సినిమాతో తొలి కమర్షియల్ హిట్ అందుకోవడమే కాదు.. ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా తీసుకుంది. ఆ తర్వాత తమిళ, తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. రీసెంట్ బేబీ జాన్ చిత్రంతో గతేడాది బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న ప్రస్తుతం రివాల్వర్ రీటా సినిమాలో నటిస్తుంది. మరోవైపు తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్థన్ చిత్రంలో హీరోయిన్ నటిస్తుంది. పెళ్లి తర్వాత కీర్తి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×